ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ దిగ్గజం ఒప్పో సంస్థ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. వీటితోపాటు ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తూనే ఉంది. ఇప్పుడు మార్కెట్లోకి మరో సరికొత్త స్మార్ట్ఫోన్ విడుదల చేయడానికి సిద్ధమయ్యింది. ఈ నెల 20న ఒప్పో నుంచి సరికొత్త 5జీ సిరీస్ వచ్చేస్తోంది. చైనీస్ టెక్ దిగ్గజం ఒప్పో లేటెస్ట్ మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ లైనప్ లో ఒప్పో ఎఫ్29, ఒప్పో ఎఫ్29 ప్రోలను మార్చి 20, 2025న లాంచ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది సదరు సంస్థ.
ఈ ఒప్పో ఎఫ్29 సిరీస్ ఆకర్షణీయమైన ఫీచర్లతో రానుందట. కాగా ఈ సిరీస్ లో ఒప్పో ఎఫ్29 ప్రో 5జీ హై ఎండ్ వేరియంట్ గా వస్తుందని భావిస్తున్నారు. కొన్ని ఆకట్టుకునే హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్ లను కూడా కలిగి ఉందట. ఐపీ68, ఐపీ69 రేటింగ్ లతో ఒప్పో రెండూ ఐపీ68, ఐపీ 69 రేటింగ్ లతో వస్తాయని భావిస్తున్నారు. అలాగే ఈ ఫోన్‌లు 1.5 మీటర్ల నీటిలో 30 నిమిషాల పాటు మునిగినా తట్టుకోగలవట. అలాగే వేడి చల్లటి నీటి జెట్ లను కూడా తట్టుకోగలవని చెబుతున్నారు. ఇకపోతే ఒప్పో ఎఫ్29 ప్రో 5జీ స్పెసిఫికేషన్ లు, ఫీచర్ల విషయానికి వస్తే..
120Hz రిఫ్రెష్ రేట్ తో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ క్వాడ్-కర్వ్డ్ అమోల్డ్ ప్యానెల్ కలిగి ఉంటుందట. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందే అవకాశం ఉందట. ఒప్పో రెనో 12 ప్రో, CMF ఫోన్ 1 ఇటీవల లాంచ్ అయిన వివో T4x ఫోన్లలో ఇదే ప్రాసెసర్ ఉంది. రియర్ కెమెరాలు, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో కూడిన 50ఎంపీ ప్రైమరీ సెన్సార్ ను కూడా కలిగి ఉందట. డెప్త్ లేదా మాక్రో షాట్ల కోసం 2ఎంపీ కెమెరా సెన్సార్ ఆప్షన్ ను కూడా కలిగి ఉందని చెబుతున్నారు.
అలాగే ఫ్రెంట్ కెమెరా 16ఎంపీ సెల్ఫీ షూటర్, హై క్వాలిటీ, వీడియో కాల్స్, ఏఐ సెల్ఫీల కోసం ఆప్టిమైజ్ ఆప్షన్లతో రానుందట. 80W ఫాస్ట్ ఛార్జింగ్ కీ సపోర్ట్ చేసే భారీ 6,000mAh బ్యాటరీని కలిగి ఉందట. ఈ ఫోన్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజీని కలిగి ఉంది. 8జీబీ రామ్ + 256జీబీ స్టోరేజీని కలిగి ఉందట. 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజీని కలిగి ఉంటుందట. కాగా ఈ ఒప్పో F29 ప్రో 5జీ ఫోన్ రూ. 30వేల లోపు ధర ఉంటుందని అంచనా. ఒప్పో ఎఫ్29 5జీ ఫోన్ ధర రూ. 25వేల లోపు ధర ఉంటుందని అంచనా.
