చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఒప్పో సంస్థ మార్కెట్ లోకి ఇప్పటికే ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది. అంతే కాకుండా ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ల లోనే వేరియేషన్ లను కూడా విడుదల చేస్తోంది. ఇది ఇలా ఉంటే ఒప్పో నుంచి భారత మార్కెట్లోకి సరికొత్త F27ప్రో ప్లస్ 5జీ ఫోన్ వచ్చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ అద్భుతమైన ఫీచర్లతో వినియోగదారుల దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తుంది. మరి ఆ వివరాల్లోకి వెళితే.. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ ద్వారా పవర్ అందిస్తుంది.
67డబ్ల్యూ వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌లో 64ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్ అమర్చారు. దుమ్ము, నీటి నిరోధకతకు ఐపీ69, ఐపీ68, ఐపీ66 వెరిఫికేషన్లతో కూడా వస్తుంది. రెండు స్టోరేజ్ ఆప్షన్లలో ఫోన్ అందుబాటులో ఉంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో చైనాలో ఆవిష్కరించిన ఒప్పో A3 ప్రో రీబ్యాడ్జ్డ్ వెర్షన్‌గా చెప్పవచ్చు. కాగా భారత మార్కెట్లో ఒప్పో ఎఫ్27ప్రో ప్లస్ 5జీ 8జీబీ+ 128జీబీ ఆప్షన్ ప్రారంభ ధర రూ. 27,999 కాగా 8జీబీ + 256జీబీ వేరియంట్ ధర రూ. 29,999 గా ఉంటుంది. ఈ రోజు నుంచి ఒప్పో ఆన్లైన్ స్టోర్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా దేశంలో ముందస్తు ఆర్డర్ చేయవచ్చు.
అయితే ఈ ఫోన్ అధికారిక విక్రయాలు జూన్ 20 నుంచి ప్రారంభం అవుతాయి. ఈ హ్యాండ్సెట్ డస్క్ పింక్, మిడ్నైట్ నేవీ అనే రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఇకపోతే ఒప్పో ఎఫ్27ప్రో ప్లస్ 5జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్ల విషయానికి వస్తే..
ఒప్పో F27ప్రో ప్లస్ 5జీ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల ఫుల్-హెచ్డీ + 3డీ కర్వ్డ్ ఓఎల్ఈడీ స్క్రీన్‌ను కలిగి ఉంది. 240Hz వరకు టచ్ శాంప్లింగ్ రేట్, 950నిట్ల వరకు లోకల్ పీక్ బ్రైట్నెస్, కార్నింగ్ జిలాస్ 2 ప్రొటెక్షన్ కలిగి ఉంది. ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ఎస్ఓసీ ద్వారా ఆధారితమైనది. ఏఆర్ఎమ్ మాలి-జీ68 ఎంసీ4 జీపీయూ, 8జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో వస్తుంది.
ఒప్పో ఎఫ్27ప్రో ప్లస్ 5జీ ఆండ్రాయిడ్ 14-ఆధారిత కలర్ఓఎస్ 14.0తో వస్తుంది. స్విస్ ఎస్జీఎస్ ప్రీమియం పెర్ఫార్మెన్స్ 5 స్టార్స్ డ్రాప్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. డెస్ట్, నీటి నిరోధకతకు ఐపీ69, ఐపీ68, ఐపీ66 రేటింగ్లను కూడా కలిగి ఉంది. ఈ ఫోన్ 64ఎంపీ ప్రైమరీ సెన్సార్, 2ఎంపీ సెకండరీ సెన్సార్‌ను కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్రంట్ కెమెరా 8ఎంపీ సెన్సార్‌ను కలిగి ఉంది. ఒప్పో ఎఫ్27ప్రో ప్లస్ 5జీ 5,000mAh బ్యాటరీతో 67డబ్ల్యూ వైర్డు సూపర్ వూక్ ఛార్జింగ్‌కు సపోర్టు అందిస్తుంది.