Site icon HashtagU Telugu

Oppo A98 5G: మార్కెట్లోకి Oppo A98 5G మోడల్

Oppo A98 5g

Oppo A98 5g

Oppo A98 5G: ప్రముఖ స్మార్ట్ ఫోన్ ఒప్పో తమ కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీ అందిస్తుంటుంది. ఇప్పటికే మార్కెట్లో రారాజుగా ఉన్న ఒప్పో సంస్థ రాబోయే రోజుల్లో మరిన్ని ఫీచర్స్ తో మొబైల్స్ ని ఇంట్రడ్యూస్ చేయనుంది. చైనాకు చెందిన దిగ్గజ సంస్థ ఒప్పో నుంచి త్వరలో మరో స్మార్ట్ ఫోన్ మార్కెట్లో సందడి చేయనున్నట్టు తెలుస్తుంది. ఒప్పో కస్టమర్లకు అదిరిపోయే న్యూస్ త్వరలోనే రాబోతున్నట్టు సోషల్ మీడియాలో వైరల్ పోస్ట్లు దర్శనమిస్తున్నాయి.

ప్రముఖ ఒప్పో ఎలక్ట్రానిక్ సంస్థ అధికారికంగా త్వరలోనే ఓ గుడ్ న్యూస్ చెప్పబోతోంది. చాలా కాలంగా ఒప్పో కస్టమర్లు A98 5G మోడల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా Oppo A98 5G మోడల్ గురించి ఆ సంస్థ సుదీర్ఘ చర్చ జరిపింది. కంపెనీ త్వరలో కొత్త డివైస్ Oppo A98 5Gని ఆవిష్కరించబోతున్నట్టు తెలుస్తుంది.

Oppo A98 5G యొక్క రెండర్ మరియు స్పెసిఫికేషన్ గురించి సమాచారం వెల్లడైంది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రమే ఈ విషయంపై చర్చ జరుగుతుంది. అధికారికంగా ఇంకా వెల్లడించలేదు. Oppo A98 5G స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో తీసుకురాబడుతోంది. ఇది కాకుండా మొబైల్ 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఫీచర్‌తో అందుబాటులోకి రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 8GB RAM మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో మార్కెట్లోకి రానుంది. 5,000mAh బ్యాటరీ. Android 13 ఆధారిత ColorOS 13 పై రన్ అవుతుంది. 6.7 స్క్రీన్‌. LTPS LCD డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ ఫీచర్‌తో తీసుకురాబడుతుందని భావిస్తున్నారు. అయితే అధికారిక సమాచారం కోసం కస్టమర్లు ఎదురుచూస్తున్నారు. త్వరలోనే కంపెనీ నుండి అధికారిక ప్రకటన రాబోతుంది.

Read More: Mobile Use: ఫోన్‌ను ఎక్కువ బ్రైట్‌నెస్‌తో ఉపయోగిస్తున్నారా.. అయితే జాగ్రత్త?