Site icon HashtagU Telugu

ChatGPT On Android : వచ్చే వారం “చాట్ జీపీటీ” మొబైల్ యాప్ రిలీజ్

Chatgpt On Android

Chatgpt On Android

ChatGPT On Android : ఓపెన్ ఏఐ (OpenAI) కంపెనీకి చెందిన “చాట్ జీపీటీ” (ChatGPT) చాట్ బోట్  త్వరలో ఆండ్రాయిడ్‌ ప్లాట్ ఫామ్ లోనూ అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించిన  ప్రీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈరోజు ప్రారంభమవుతుంది. అంటే ఇవాళ్టి నుంచి  “చాట్ జీపీటీ” యాప్ లోకి  సైన్-అప్‌లు షురూ అవుతాయి. “చాట్ జీపీటీ” మొబైల్  యాప్ వచ్చేవారం అమెరికాలో ఆండ్రాయిడ్‌ ప్లాట్ ఫామ్ లోనూ లాంచ్ కాబోతోంది. యాపిల్ కంపెనీకి చెందిన  iOS ప్లాట్ ఫామ్ లో గత రెండు నెలలుగా  సక్సెస్ ఫుల్ గా పనిచేస్తున్న “చాట్ జీపీటీ” యాప్.. త్వరలో గూగుల్ కు చెందిన ఆండ్రాయిడ్ ప్లాట్ ఫామ్ (ChatGPT On Android) ద్వారానూ  వినియోగదారులకూ మొబైల్ యాప్ రూపంలో సర్వీసులను అందించేందుకు రెడీ అవుతోంది.

Also read : Snake Bite : పాము కాటు వేస్తే..హాస్పటల్ కు వెళ్లకుండా ఆకుపసరు తిన్నారు..ఆ తర్వాత

iOS ప్లాట్ ఫామ్ లో ChatGPT యాప్ ను లాంచ్ చేసిన  మొదటివారంలో 5 లక్షల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. వెబ్ ఇంటర్‌ ఫేస్ ద్వారానూ  OpenAI టూల్స్‌ను యాక్సెస్ చేసే ఎంపిక ఉన్నప్పటికీ.. యాప్స్ ద్వారా వినియోగం చాలా కంఫర్ట్ గా ఉంటుందనే ఒపీనియన్ నెటిజన్స్ లో ఉంది. ఇంట్లో పర్సనల్ కంప్యూటర్ కలిగిన వారి సంఖ్య కంటే.. జేబులో స్మార్ట్ ఫోన్ కలిగిన వారి సంఖ్యే ఎక్కువ. అందుకే రానున్న రోజుల్లో ChatGPT యాప్ డౌన్‌లోడ్ల సునామీని సృష్టించనుందనే విశ్లేషణలు వెలువడుతున్నాయి.

Also read : Rains : ముంబైలో రానున్న 24 గంట‌ల‌పాటు భారీ వ‌ర్షాలు.. అరెంజ్ అలెర్ట్ ప్ర‌క‌టించిన వాతావ‌ర‌ణ‌శాఖ‌

Twitter వేదికగా OpenAI కంపెనీ చేసిన అధికారిక ప్రకటన ప్రకారం.. ChatGPT ఆండ్రాయిడ్ యాప్ వచ్చే వారం అమెరికాలో ప్రారంభమవుతుంది. అయితే ఇతర దేశాల్లో దాన్ని ఎప్పుడు లాంచ్ చేస్తారనే వివరాలను వెల్లడించలేదు. ఆగస్టు చివరి వారం నుంచి ఇతర దేశాల్లోనూ ChatGPT ఆండ్రాయిడ్ యాప్ రిలీజ్ జరిగే ఛాన్స్ ఉంది.