Voice Clone : ప్రఖ్యాత ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ ఛాట్ బోట్ ‘ఓపెన్ ఏఐ’ (OpenAI) నుంచి మరో ఆవిష్కరణ రిలీజ్ అయ్యింది. వ్యక్తుల వాయిస్‌ను క్లోనింగ్ చేసే ఏఐ టూల్‌ను ఆ కంపెనీ విడుదల చేసింది. దానిపేరే ‘వాయిస్ ఇంజిన్’ !! ఇది వ్యక్తి మాట్లాడే వాయిస్‌ను రికార్డ్ చేసుకుని.. ఆ తర్వాతి నుంచి అచ్చం అతనిలా మాట్లాడగలదు. కేవలం 15 సెకన్ల వాయిస్ రికార్డ్ ద్వారా.. సదరు వ్యక్తిని తలపించే వాయిస్‌తో ఆడియోను జనరేట్ చేయగలగడం ‘వాయిస్ ఇంజిన్’ ఫీచర్ ప్రత్యేకత. ఈ ఫీచర్ దుర్వినియోగానికి గురయ్యే రిస్క్ ఉన్నందున.. సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండదు. ప్రస్తుతం ఈ ఫీచర్ పరీక్షల దశలోనే ఉందని అంటున్నారు.
We’re now on WhatsApp. Click to Join
ఈ ఏడాది భారత్, అమెరికా సహా చాలా దేశాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఒకవేళ ఇప్పుడు ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే రాజకీయ నాయకుల వాయిస్‌లను క్లోనింగ్(Voice Clone) చేసి దుర్వినియోగం చేసే ముప్పు ఉంటుంది. రాజకీయ ప్రత్యర్ధుల ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు ‘వాయిస్ ఇంజిన్’ ఫీచర్‌ను వాడుకునే అవకాశం ఉంటుందనే ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రత్యర్ధుల గొంతుతో ఆడియో క్లిప్‌లను తయారు చేయించి.. వాటిని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసి రాజకీయ ప్రయోజనం పొందేందుకు కుట్రలు పన్నే అవకాశం ఉందని అంటున్నారు. ఇలాంటి సమస్యలు తలెత్తినప్పుడు ఏం చేయాలి ? ఈ టెక్నాలజీతో తయారయ్యే ఫేక్ ఆడియో క్లిప్‌ల ఫ్యాక్ట్ చెక్ ఎలా ? దీనిపై బాధితుల నుంచి ఫిర్యాదులకు పరిష్కారం ఎలా ? అనే అంశాలపై మరింత చర్చ జరగాల్సిన అవసరం ఉంది.
Also Read : RCB vs KKR: కోహ్లీ స్లో బ్యాటింగ్.. సెల్ఫిష్ అంటున్న నెటిజన్లు
ఈ అంశాలన్నింటికి తగిన సమాధానం దొరికిన తర్వాతే ‘వాయిస్ ఇంజిన్’ ఫీచర్‌ను విస్తృత స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తామని ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ తెలిపారు. ఇటీవల కాలంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వాయిస్‌ను కృత్రిమ మేధ ద్వారా క్లోనింగ్ చేశారు. ఆ ఫేక్ ఆడియో క్లిప్‌లో వాస్తవ విరుద్ధమైన సమాచారం ఉంది. తనకు ఓటు వేయొద్దని ప్రజలను బైడెన్ కోరుతున్నట్లుగా ఆ ఆడియో క్లిప్‌లో తప్పుడు సమాచారం. ఇది అమెరికాలో పెద్ద వివాదానికి దారితీసింది.