OnePlus Nord CE 4: వన్‌ప్లస్ స్మార్ట్ ఫోన్‌పై భారీగా డిస్కౌంట్‌.. కానీ ఈ ఆఫర్ అప్పటి వరకు మాత్రమే?

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ సంస్థ వన్‌ప్లస్ కమ్యూనిటీ సేల్‌ ఆఫర్‌ పేరుతో సేల్‌ను నిర్వహిస్తోంది. అయితే కేవలం వన్‌ప్లస్‌ అధికారిక వెబ్‌సైట్‌లో మాత్

  • Written By:
  • Publish Date - June 11, 2024 / 06:43 AM IST

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ సంస్థ వన్‌ప్లస్ కమ్యూనిటీ సేల్‌ ఆఫర్‌ పేరుతో సేల్‌ను నిర్వహిస్తోంది. అయితే కేవలం వన్‌ప్లస్‌ అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే కాకుండా అన్ని ఈ కామర్స్‌ ఫ్లాట్‌ఫామ్స్‌, రిటైల్‌ అవుట్‌లెట్స్‌ లో కూడా ఈ డిస్కౌంట్స్‌ లభిస్తున్నాయి. అయితే ఈ ఆఫర్ ఎక్కువ రోజులు ఉండదు. కేవలం జూన్‌ 6వ తేదీ నుంచి 11వ తేదీ వరకు మాత్రమే ఈ సేల్‌ కొనసాగనుంది. ప్రముఖ ఎలక్ట్రానిక్‌ సంస్థ వన్‌ప్లస్ కమ్యూనిటీ సేల్‌ ఆఫర్‌ పేరుతో సేల్‌ను నిర్వహిస్తోంది. వన్‌ప్లస్‌ అధికారిక వెబ్‌సైట్‌ తో పాటు అన్ని ఈ కామర్స్‌ ఫ్లాట్‌ఫామ్స్‌, రిటైల్‌ అవుట్‌లెట్స్‌ లో కూడా ఈ డిస్కౌంట్స్‌ లభిస్తున్నాయి.

మరి ఏ స్మార్ట్ ఫోన్ల పై ఎంత ఆఫర్లు లభిస్తున్నాయి. అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వన్‌ప్లస్‌ నార్డ్‌ సీటీ4 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 24,999 కాగా 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 26,999గా నిర్ణయించారు. అయితే ప్రస్తుతం ఈ సేల్‌లో భాగంగా ఈ ఫోన్‌పై రూ. 20000 ఇన్‌స్టాంట్‌ డిస్కైంట్‌ లభిస్తోంది. అలాగే పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 500 డిస్కౌంట్‌ లభిస్తోంది. మరి ఈ వన్‌ప్లస్‌ నార్డ్‌ సీటీ4 ఫోన్ ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో 6.7 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్డీ+ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 240 హెచ్‌జెడ్‌ టచ్‌ సాంప్లింగ్ రేట్‌తో అందించారు.

ఈ ఫోన్‌ క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 7 జెన్‌ 3 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. అలాగే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 100 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5500 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. ఇక కనెక్టివిటీ విషయానికొస్తే.. ఇందులో 5జీ నెట్‌వర్క్‌ సపోర్ట్‌తో పాటు బ్లూటూత్‌ 5.4, జీపీఎస్‌, డ్యూయల్ బాండ్‌ వైఫై, బీడీఎస్‌, యూఎస్‌బీ టైప్‌ సీ పోర్టును అందించారు. ఇకపోతే కెమెరా విషయానికొస్తే.. ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన ప్రైమరీ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 16 మెగా పిక్సెల్స్‌ తో కూడిన ఫ్రంట్ కెమెరాను కూడా అందించారు. ఈ 100 శాతం బ్యాటరీ కేవలం 29 నిమిషాల్లో పూర్తయ్యేలా సూపర్‌ వూక్‌ ఫాస్ట్ ఛార్జర్‌ను కూడా అందించారు. ఇన్ని అద్భుతమైన ఫీచర్లు కలిగిన ఈ స్మార్ట్ ఫోన్లో సొంతం చేసుకోవాలంటే వెంటనే సమీపంలో ఉన్న మొబైల్స్ షాప్స్ కి వెళ్లాల్సిందే.

Follow us