Site icon HashtagU Telugu

OnePlus: వన్‌ప్లస్ 5 జీ ఫోన్ పై భారీగా తగ్గింపు.. ధర,ఫీచర్స్ పూర్తి వివరాలివే?

OnePlus

Oneplus Nord Ce 3 5g Receives Price Cut In India 2

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం వన్‌ప్లస్‌ సంస్థ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. మార్కెట్లో కూడా వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ లకు భారీగా డిమాండ్ క్రేజ్ ఉంది. దీంతో ఆ క్రేజ్ ని దృష్టిలో ఉంచుకొని వన్ ప్లస్ సంస్థ కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది. దాంతోపాటుగా ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేసిన స్మార్ట్ ఫోన్లపై తగ్గింపు ధరలను ప్రకటిస్తూ వినియోగదారులను విపరీతంగా ఆకర్షిస్తుంది వన్ ప్లస్. ఇది ఇలా ఉంటే తాజాగా కూడా మరోసారి వినియోగదారుల కోసం వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ పై తగ్గింపు ధరలను ప్రకటించింది. మరి ఆ వివరాల్లోకి వెళితే.. వన్‌ప్లస్‌ నోర్డ్ CE3 5జీ ఫోన్ ని చాలా చౌక ధరలో ఇంటికి తీసుకురావచ్చని సమాచారం.

వినియోగదారులు వన్‌ప్లస్‌ నోర్డ్ CE3 5జీ ఫోన్‌ని 8 జీబి 128 జీబీ స్టోరేజ్‌ తో రూ. 26,999కి బదులుగా రూ. 24,999కి కొనుగోలు చేయవచ్చు. అయితే వినియోగదారులు ఫోన్ కొనుగోలు చేయడానికి ఐసిఐసిఐ బ్యాంక్ కార్డును ఉపయోగిస్తే, మీకు రూ. 2,000 తక్షణ తగ్గింపు ఇవ్వబడుతుంది. అంతేకాకుండా కాకుండా మీరు వన్ కార్డ్ వినియోగదారు అయినప్పటికీ, మీరు ఫోన్‌లో రూ. 2000 ఆదా చేయవచ్చు. అలాగే కఫోన్ కొనుగోలుపై, వినియోగదారులు జియో ప్లస్ పోస్ట్‌పెయిడ్ రూ. 399 ప్లాన్‌లో రూ. 4,500 ప్రయోజనాన్ని పొందవచ్చు. ఇది కాకుండా, ఒప్పందంలో భాగంగా, స్పోటిఫై ప్రీమియం కూడా 6 నెలల పాటు ఇవ్వబడుతుంది. స్పెసిఫికేషన్ల పరంగా, OnePlus ఈ అద్భుతమైన 5జీ ఫోన్ 6.7 అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది, ఇది పూర్తి హెచ్డీ రిజల్యూషన్‌తో వస్తుంది.

దీని డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. దీని టచ్ రెస్పాన్స్ రేట్ 240Hz. ఫోన్ HDR 10+ కంటెంట్‌కు కూడా మద్దతు ఇస్తుంది. వన్‌ప్లస్‌ ప్రసిద్ధ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌ డ్రాగన్ 782జీ చిప్‌సెట్‌తో అమర్చబడి ఉంది, ఇది Adreno 642L GPU, 12జీబీ ర్యామ్ మరియు 256జీబీ నిల్వకు మద్దతు ఇస్తుంది. ఇకపోతే కెమెరా విషయానికి వస్తే.. వన్‌ప్లస్‌ నోర్డ్ CE 3 ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇది 50-మెగాపిక్సెల్ సోనీ IMX890 ప్రైమరీ సెన్సార్
8-మెగాపిక్సెల్ సోనీ IMX355 అల్ట్రా-వైడ్- యాంగిల్ లెన్స్ 2-మెగాపిక్సెల్ మాక్రో యూనిట్‌ను కలిగి ఉంది. సెల్ఫీ కోసం, స్మార్ట్‌ఫోన్‌లో 16- మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఇది EISకి మద్దతు ఇస్తుంది. పవర్ కోసం, ఈ స్మార్ట్‌ఫోన్ 5000mAh బ్యాటరీతో వస్తుంది, ఇది 80W SuperVOOC ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. భద్రత కోసం, ఈ వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌లో IR బ్లాస్టర్ మరియు ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉన్నాయి. కనెక్టివిటీ కోసం, స్మార్ట్‌ఫోన్ 5జీ , NFC మరియు USB టైప్-సి పోర్ట్‌లకు మద్దతు ఇస్తుంది.

Exit mobile version