OnePlus Nord CE 4 Lite: త్వరలో మార్కెట్ లోకి రాబోతున్న వన్‌ప్లస్ కొత్త ఫోన్.. లాంచింగ్ అయ్యేది అప్పుడే?

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం వన్‌ప్లస్‌ సంస్థ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే

  • Written By:
  • Publish Date - June 16, 2024 / 01:55 PM IST

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం వన్‌ప్లస్‌ సంస్థ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. మార్కెట్లో కూడా వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ లకు భారీగా డిమాండ్ ఉంది. దాంతో కొత్త కొత్త ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది. అలాగే ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేసిన స్మార్ట్ ఫోన్లపై తగ్గింపు ధరలను ప్రకటిస్తూ వినియోగదారులను విపరీతంగా ఆకర్షిస్తుంది వన్ ప్లస్. ఆ సంగతి అటు ఉంచితే త్వరలోనే వన్ ప్లస్ సంస్థ మార్కెట్లోకి మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ తీసుకు రాబోతుంది.

మరి ఆ వివరాల్లోకి వెళితే.. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ లాంచ్ తేదీని కంపెనీ రిలీజ్ చేసింది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 భారత్‌లో కొన్ని నెలల క్రితమే అరంగేట్రం చేసినప్పటికీ వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ లైనప్ నుంచి స్పష్టంగా లేదు. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ జూన్ 18న సాయంత్రం 7 గంటలకు భారత మార్కెట్లో లాంచ్ కావచ్చని టీజర్ ని చూస్తే తెలుస్తోంది. ఇకపోతే ఈ వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ స్పెసిఫికేషన్‌ల విషయానికి వస్తే.. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ ఇంకా ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. కానీ ఈ ఫోన్ ఏడాది ప్రారంభంలో చైనాలో లాంచ్ అయిన ఒప్పో కె12ఎక్స్ రీబ్రాండెడ్ వెర్షన్ కావచ్చని తెలుస్తోంది.

ఒకవేళ అదేంటి నిజమని తేలితే.. నార్డ్ సీఈ 4 లైట్ 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోల్డ్ డిస్‌ప్లేను 120Hz రిఫ్రెష్ రేట్‌తో 1200నిట్స్ గరిష్ట ప్రకాశంతో వస్తుంది. అలాగే ఈ వన్‌ప్లస్ సీఈ 4 లైట్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. గ్రాఫిక్స్ ఇంటెన్సివ్ టాస్క్‌లను అడ్రినో 619 జీపీయూతో వస్తుంది. ఈ ఫోన్ గరిష్టంగా 12జీబీ ఎల్‌పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 512జీబీ వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్‌తో రావచ్చు. వన్‌ప్లస్ సీఈ 4 లైట్ 50ఎంపీ ప్రైమరీ సెన్సార్, 2ఎంపీ డెప్త్ సెన్సార్‌తో బ్యాక్ డ్యూయల్ కెమెరా సెటప్ సెటప్‌తో రావచ్చు. అంతేకాకుండా, సెల్ఫీలు, వీడియో కాల్‌లకు 16ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ షూటర్‌ కలిగి ఉంటుంది. ఈ వన్‌ప్లస్ ఫోన్ 80డబ్ల్యూ సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,500mAh బ్యాటరీ ప్యాక్‌తో వచ్చే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా ఆక్సిజన్‌ఓఎస్ 14లో రన్ అవుతుంది. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ ద్వారా విషయానికి వస్తే.. ఈ స్మార్ట్ ఫోన్ 15000 ధరతో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇక 15,000 నుంచి మొదలై రూ. 21 వేల వరకు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాలి అంటే కొద్దిరోజులు వేచి చూడాల్సిందే.