OnePlus: మార్కెట్ లోకి మరో వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం

  • Written By:
  • Publish Date - March 29, 2023 / 06:30 AM IST

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. కొత్త కొత్త స్మార్ట్ ఫోన్ లో విడుదల చేయడంతో పాటు ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ లపై డిస్కౌంట్ ని ప్రకటిస్తోంది. వాటితో పాటుగా వినియోగదారుల అభిరుచుల మేరకు కొత్త స్మార్ట్ ఫోన్లు మార్కెట్ లోకి విడుదల చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే వన్‌ప్లస్ సంస్థ వన్‌ప్లస్ నోర్డ్ సిఈ 3లైట్ స్మార్ట్ ఫోన్ ని భారత్ లోకి విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్‌ను ఏప్రిల్ 4న భారత మార్కెట్‌లో విడుదల చేయనున్నట్లు వన్ ప్లస్ సంస్థ ప్రకటించింది.

అయితే లాంచ్ తేదీ దగ్గర పడుతుండగా ఆ స్మార్ట్ ఫోన్ కీ సంబంధించిన స్పెసిఫికేషన్లు ఇప్పటికే లీక్స్ ద్వారా వెల్లడయ్యాయి. ఇప్పుడు కొత్త లీక్‌లో, వన్‌ప్లస్ ఫోన్ ధర కూడా వెల్లడైంది. మరి ఈ స్మార్ట్ ఫోన్ ధర స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. వన్‌ప్లస్ నోర్డ్ సీఈ 3 లైట్ భారతదేశంలో 8జీబీ 128జీబీ మెమరీతో ప్రారంభించబడుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ మనకు రెండు రంగులలో లభించునుంది. పాస్టెల్ లైమ్, క్రోమాటిక్ గ్రే అనే రెండు రంగులలో లభించనుంది. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ ధర విషయానికొస్తే..

ఈ ఫోన్ ఫోన్ ధర రూ. 27,999గా ఉండవచ్చని తెలుస్తోంది. అయితే స్మార్ట్ ఫోన్ ధరను కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఫీచర్ ల విషయానికి వస్తే.. ఈ సరికొత్త స్మార్ట్ ఫోన్ కొత్త డిజైన్ తో లాంచ్ కాబోతోంది. కెమెరా విషయానికి వస్తే ఇందులో 108 ఎంపీ కెమెరాను అందించనున్నారు. అలాగే, కంపెనీ ఈ ఫోన్‌కు 67W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పెద్ద 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యాన్ని కూడా కలిగి ఉండడం ఉందని తెలుస్తోంది. అయితే, దాని పాత మోడల్ వన్‌ప్లస్ నోర్డ్ సిఈ2 లైట్ , 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 33W ఛార్జింగ్ సపోర్ట్‌ను పొందుతుంది. ఇందులో కనిపించే డిస్‌ప్లే 6.72 అంగుళాల పెద్దదిగా ఉంటుంది.