ప్రస్తుతం అమెజాన్ లో వన్‌ప్లస్ నార్డ్ 4పై భారీ తగ్గింపు ధర అందిస్తోంది. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ ర్యామ్ వేరియంట్ ప్రస్తుతం అమెజాన్ లో రూ. 28,999 గా ఉంది. అయితే, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్ తో కొనుగోలు చేస్తే ఈ ఫోన్ పై మరింత తగ్గింపును పొందవచ్చు. ఈ ఫోన్ ధర రూ. 25 వేల కన్నా తక్కువగా ఉంటుంది. వన్‌ప్లస్ నార్డ్ 4 మొదటగా గత ఏడాది జూలై లో లాంచ్ కాగా, ధరలు బేస్ మోడల్ 8 జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్ ఆప్షన్ ధర రూ.29,999 నుంచి ప్రారంభమవుతాయి.
మెటల్ యూనిబాడీ డిజైన్, స్నాప్‌డ్రాగన్ 7+ జనరేషన్ 3 చిప్‌సెట్, ఫ్లాట్ 120Hz అమోల్డ్ డిస్‌ప్లే, 5,500mAh బ్యాటరీ, 6 ఏళ్ల వరకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ లకు సపోర్ట్ చేయడం వంటి ముఖ్య ఫీచర్లు ఇందులో ఉన్నాయి. వన్‌ప్లస్ నార్డ్ 4 ఫోన్ అమెజాన్ లో కేవలం రూ. 24,999 కే అందుబాటులో ఉంది. వన్‌ప్లస్ నార్డ్ 4 ఫోన్ మధ్య 8 జీబీ ర్యామ్+ 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ప్రస్తుతం అమెజాన్ లో రూ. 28,999 గా ఉంది. కాగా ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 32,999 కాగా ఈ ఆఫర్లో భాగంగా ఏకంగా 4000 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. అలాగే 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజీ ఉన్న టాప్ ఎండ్ వేరియంట్ అసలు ధర రూ. 35,999 కాగా ఆఫర్లో భాగంగా ఈ ఫోన్ రూ. 31,999 లకు లభిస్తోంది.
అంటే ఈ ఫోన్ రెండు వేరియంట్లకు రూ. 4వేల ఫ్లాట్ తగ్గింపు ఆఫర్ తో అందుబాటులో ఉంది. మీరు ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కలిగి ఉంటే మీరు చెక్ అవుట్ ఫ్లాట్ రూ. 4వేల ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు. వన్‌ప్లస్ నార్డ్ 4 ఫోన్ 8జీబీ ర్యామ్ వేరియంట్ ధరను రూ.24,999 కి తగ్గించింది. 12జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.27,999 కి తగ్గింది. మీకు ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లేకపోయినా, ఇంకా డీల్‌ను పొందాలనుకుంటే మీరు ఆర్బీఎల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని కలిగి ఉండాలి. ఆర్బీఎల్ బ్యాంక్ కార్డ్ యూజర్‌లు కంపెనీ అధికారిక వెబ్‌సైట్ నుంచి ఫోన్‌ను కొనుగోలు చేస్తే ఘనంగా మరో రూ.4వేల ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ ని కూడా పొందవచ్చు.