Site icon HashtagU Telugu

OnePlus Nord 3: వన్‌ప్లస్ ఫోన్‌పై భారీగా డిస్కౌంట్.. ఈ అవకాశం అస్సలు మిస్సవ్వకండి?

Mixcollage 29 Dec 2023 02 58 Pm 4411

Mixcollage 29 Dec 2023 02 58 Pm 4411

వన్‌ప్లస్ సంస్థ ఈ ఏడాది జులైలో వన్‌ప్లస్ నార్డ్ 3 ఫోన్ ని మార్కెట్లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. రెండు వేరియంట్లలో రూ.33,999 ప్రారంభ ధరతో లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్‌పై ప్రస్తుతం భారీ డిస్కౌంట్లు ఉన్నాయి. మరి ఆ డిస్కౌంట్ లు ఏవి? అవి ఎంతవరకు వర్తించనున్నాయి అన్న వివరాల్లోకి వెళితే.. వన్‌ప్లస్ నార్డ్ 3 ఫోన్ భారతదేశంలో రెండు వేరియంట్లలో రిలీజ్ అయింది. 8జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజ్ మోడల్‌ ధర రూ.33,999 కాగా, 16జీబీ 256జీబీ వేరియంట్ రూ.37, 999 గా ఉంది. అయితే ఇప్పుడు వన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు పార్ట్‌నర్ ఇ-కామర్స్ కంపెనీ అమెజాన్‌ ఈ ఫోన్‌పై ఫ్లాట్ రూ.4వేల డిస్కౌంట్ అందిస్తున్నాయి.

అంటే ఇప్పుడు బేస్ వేరియంట్ ధర రూ. 29,999కి పడిపోయింది. 16జీబీ వెర్షన్ రూ.33,999కి లిస్ట్ అయింది. నార్డ్ 3 స్మార్ట్‌ఫోన్‌పై అమెజాన్ మరిన్ని ఆఫర్లను ప్రకటించింది. ఐసీఐసీఐ, ఇతర బ్యాంకుల కార్డులతో ఫోన్‌ను కొనుగోలు చేసే కస్టమర్లు రూ.2వేల అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. దీనిపై మంచి ఈఎంఐ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ నార్డ్ 3 కొనుగోలుపై ఏకంగా రూ.28వేల వరకు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ సైతం అందిస్తోంది. వీటన్నింటితో లేటెస్ట్ నార్డ్ 3ని భారీ తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు. వన్‌ప్లస్ నార్డ్ 3 ఫోన్ 6.74 అంగుళాల AMOLED డిస్ప్లేతో, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్‌సెట్‌తో మంచి పనితీరు అందిస్తుంది.

12జీబీ ర్యామ్ 256జీబీ వరకు స్టోరేజ్‌ ఆప్షన్ లలో లభిస్తుంది. ఆండ్రాయిడ్ 13 బేస్ట్ ఆక్సిజన్ OS 13.1 వెర్షన్‌తో ఫోన్ రన్ అవుతుంది. నార్డ్ 3 ఫోన్ 5,000mAh బ్యాటరీతో వస్తుంది. ఇది 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. ఈ ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులోని 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 8ఎంపీ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 2ఎంపీ మాక్రో కెమెరాలు మంచి ఫోటోలు, వీడియోలను క్యాప్ఛర్ చేస్తాయి.ఈ స్మార్ట్‌ఫోన్‌లో 16ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. అలర్ట్ స్లైడర్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డాల్బీ అట్మోస్‌ స్టీరియో స్పీకర్లు, USB టైప్-సి ఆడియో వంటి స్పెసిఫికేషన్లతో వచ్చిన ఈ హ్యాండ్‌సెట్ మిస్టీ గ్రీన్, టెంపెస్ట్ గ్రే కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

Exit mobile version