Site icon HashtagU Telugu

One Plus 13: వన్ ప్లస్ యూజర్స్ కీ గుడ్ న్యూస్.. మార్కెట్ లోకి నయా ఫోన్ రిలీజ్!

One Plus 13

One Plus 13

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం వన్‌ప్లస్‌ సంస్థ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది. దాంతో పాటుగా ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేసిన స్మార్ట్ ఫోన్లపై తగ్గింపు ధరలను ప్రకటిస్తూ వినియోగదారులను విపరీతంగా ఆకర్షిస్తోంది వన్ ప్లస్ సంస్థ. ఇది ఇలా ఉంటే వన్‌ప్లస్ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేయడానికి సిద్ధమవుతోంది.

కాగా వన్‌ప్లస్ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వన్‌ప్లస్ 13 ఫోన్‌పై ఆ కంపెనీ కీలక అప్‌డేట్‌ను ఇచ్చింది. అక్టోబర్‌ లో ఈ ఫోన్‌ ను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. మరి త్వరలోనే మార్కెట్లోకి విడుదల కానున్న ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించి మరిన్ని వివరాలు లోకి వెళితే.. వన్‌ప్లస్ 13 ఫోన్‌ ను అక్టోబర్లో చైనాలో జరిగే కార్యక్రమంలో విడుదల చేసే అవకాశం ఉందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో కచ్చితంగా ఈ ఫోన్ లాంచ్ ఉంటుందని పేర్కొంటున్నారు. వన్‌ప్లస్ 13 స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 4 చిప్‌ సెట్‌ తో వస్తుంది. ముఖ్యంగా వచ్చే నెలలో హవాయిలో జరగనున్న స్నాప్ డ్రాగన్ సమ్మిట్లో క్వాల్కమ్ ఫ్లాగ్లిప్లో ఈ కొత్త ఆండ్రాయిడ్ చిప్ సెట్‌ ను ప్రకటించనుంది.

వన్ ప్లస్ 13 ఫోన్ 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌ తో 6.8 అంగుళాల స్క్రీన్‌తో వస్తుంది. 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో పని చేసే ఈ ఫోన్ 100 వాట్స్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ రావచ్చని అంచనా వేస్తున్నారు. వన్ ప్లస్ 13 స్మార్ట్ ఫోన్‌లో మూడు కెమెరాల సెటప్‌తో వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా 6 ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో డ్యూయల్ 50 ఎంపీ పెరిస్కోప్ కెమెరాలతో ఈ ఫోన్‌ను లాంచ్ చేయనున్నారు.