Site icon HashtagU Telugu

One Plus Ace5: అద్భుతమైన ఫీచర్లతో మార్కెట్లోకి విడుదల అయిన వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్!

One Plus Ace5

One Plus Ace5

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం వన్‌ప్లస్‌ సంస్థ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది. దాంతో పాటుగా ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేసిన స్మార్ట్ ఫోన్లపై తగ్గింపు ధరలను ప్రకటిస్తూ వినియోగదారులను విపరీతంగా ఆకర్షిస్తోంది వన్ ప్లస్ సంస్థ. ఇది ఇలా ఉంటే వన్‌ప్లస్ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. వన్‌ప్లస్‌ ఏస్‌5 సిరీస్‌ పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొస్తున్నారు.

వన్‌ప్లస్‌ ఏస్‌5, వన్‌ప్లస్ ఏస్‌5 ప్రో పేర్లతో రెండు ఫోన్‌ లను తీసుకొస్తున్నారు. చైనాలో ఏ ఏడాది చివరిలో ఫోన్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ ఫోన్‌కు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయిత నెట్టింట ఈ ఫోన్‌ కు సంబంధించి కొన్ని ఫీచర్స్‌ లీక్‌ అవుతున్నాయి. వీటి ప్రకారం ఈ ఫోన్‌ లో స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 3 చిప్‌సెట్‌ ను ఇవ్వనున్నారు. వన్‌ప్లస్‌ ఏస్‌5 ఫోన్‌లో 6.78 ఇంచస్ తో కూడిన మైక్రో కర్వ్‌డ్‌ స్క్రీన్‌ను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 1.5 కే రిజల్యూషన్‌తో ఈ స్క్రీన్‌ ను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే కెమెరా విషయానికొస్తే.. ఇందులో 50 మెగా పిక్సెల్స్‌ తో కూడిన ట్రిపుల్ రెయిర్‌ సెటప్‌ తో కూడిన కెమెరాలను అందించనున్నట్లు తెలుస్తోంది. ఫ్రంట్‌ కెమెరాకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా ఈ ఫోన్ లో 100 వాట్స్‌ వైర్డ్‌ ఛార్జింగ్‌ కు సపోర్ట్ చేసే 6200 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది భారత్‌లో ఈ ఫోన్‌ వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోది. ఇకపోతే స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన మరిన్ని వివరాలతో పాటు దర వివరాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది.