ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల అద్భుతమైన ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. మార్కెట్లో కూడా వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ లకు ఉన్న క్రేజ్,డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే వన్‌ప్లస్ సంస్థ కూడా మార్కెట్ ను మరింతగా విస్తరించుకునేందుకు గట్టిగానే ప్రయత్నం చేస్తోంది. అయితే ఇప్పటికే మార్కెట్లోకి పదుల సంఖ్యలో కొత్త కొత్త స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన వన్ ప్లస్ సంస్థ మరో స్మార్ట్ ఫోన్ ని మార్కెట్ లోకి తీసుకురాబోతోంది. ఆ వివరాల్లోకి వెళితే..
వన్‌ప్లస్ 12 పేరుతో కొత్త ఫోన్‌ను లాంచ్ చేయనున్నారు. ఇప్పటి వరకు వన్‌ప్లస్ నుంచి రాని విభిన్న మోడల్‌లో ఈ ఫోన్‌ను తీసుకురానున్నారు. ఈ ఏడాది చివరి నాటికి వన్‌ప్లస్ 12 స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు వన్‌ప్లస్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కొత్త డిజైన్ లోగోతో ఈ ఫోన్‌ను తీసుకురానున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే ఈ ఫోన్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాజాగా ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించి కొన్ని లీక్ లు వైరల్ అవుతున్నాయి. ఇందులో 6.7 ఇంచెస్‌తో కూడిన ఫ్లూయిడ్ ఎల్‌టీపీఓ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ఈ డిస్‌ప్లే 2కే రిజల్యూషన్‌తో పనిచేయనున్నట్లు సమాచారం. వన్‌ప్లస్ 12 స్మార్ట్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్ ద్వారా పనిచేయనున్నట్లు తెలుస్తోంది. ఆ కొత్త ఫోన్‌ను 16జీబీ లేదా 24 జీబీ ర్యామ్‌తో తీసుకురానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ ఇవ్వనున్నారు. ఇక ఈ ఫోన్‌లో కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారని సమాచారం. ఇందులో 64 మెగాపిక్సెల్ టెలిఫొటో, 50 మెగాపిక్సెల్‌తో కూడిన అల్ట్రా వైడ్ కెమెరాను అందించనున్నారని తెలుస్తోంది. అలాగే సెల్ఫీల కోసం 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.