Oneplus: తక్కువ బడ్జెట్ లో వన్ ప్లస్ నార్డ్ ఎన్ 300.. ధర ఫీచర్లు ఇవే?

ప్రముఖ స్మార్ట్‌ ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ తాజాగా వన్‌ప్లస్ నోర్డ్ ఎన్300 స్మార్ట్‌ఫోన్‌ ను లాంచ్ చేసింది. వన్ ప్లస్ సంస్థ యూఎస్

  • Written By:
  • Publish Date - October 25, 2022 / 04:44 PM IST

ప్రముఖ స్మార్ట్‌ ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ తాజాగా వన్‌ప్లస్ నోర్డ్ ఎన్300 స్మార్ట్‌ఫోన్‌ ను లాంచ్ చేసింది. వన్ ప్లస్ సంస్థ యూఎస్ మార్కెట్ లో వన్ ప్లస్ నార్డ్ ఎన్ 300 5జీ మోడల్ ను విడుదల చేసింది. కాగా తాజాగా విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్ మిడ్ నైట్ జేడ్ అనే ఒక రంగులో లభించే ఈ స్మార్ట్ చూడడానికి కూడా ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ 4జీబీ ర్యామ్ లభిస్తుంది. కాగా ఈ స్మార్ట్ ఫోన్ ధర అమెరికాలో 288 డాలర్లు. అనగా మన ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.19 వేలు.

అయితే నవంబర్ మూడవ తేదీ నుంచి అమెరికాలో ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన విక్రయాలు మొదలుకానున్నాయి. కాకా ఏం స్మార్ట్ ఫోన్ ని ఇతర మార్కెట్లలోకి ఎప్పుడు విడుదల చేస్తారు అన్నది వన్ ప్లస్ సంస్థ ఇంకా వెల్లడించలేదు. 6.5 అంగుళాల ఐపీఎస్ ఎల్ సీడీ స్క్రీన్, మీడియాటెక్ డైమెన్సిటీ 810 5జీ చిప్ సెట్ ఉంటుంది. మీడియాటెక్ ప్రాసెసర్ తో అమెరికాలో విడుదలైన మొదటి ఫోన్ కూడా ఇదే.

ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై ఆక్సిజన్ ఓఎస్ సాయంతో ఈ స్మార్ట్ ఫోన్ పనిచేస్తుంది. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ తో పాటు 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ అడాప్టర్ కూడా లభించునుంది. ఈ నార్డ్ ఎన్ 300 స్మార్ట్ ఫోన్ లో ముందు సెల్ఫీల కోసం 8 మెగాపిక్సల్ కెమెరా, వెనుక భాగంలో 48 మెగా పిక్సల్ కెమెరా, 2 మెగాపిక్సల్ డెప్త్ లెన్స్ తో డ్యుయల్ కెమెరా సెటప్ ఉంటుంది. పవర్ బటన్ వద్దే ఫింగర్ ప్రింట్ స్కానర్ లభించనుంది.