OnePlus Nord CE 4: అద్భుతమైన ఫీచర్లతో అదరగొడుతున్న వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్.. తక్కువ బడ్జెట్ కే?

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం వన్‌ప్లస్‌  సంస్థ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే.

  • Written By:
  • Publish Date - April 3, 2024 / 08:11 PM IST

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం వన్‌ప్లస్‌  సంస్థ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. మార్కెట్లో కూడా వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ లకు భారీగా డిమాండ్ ఉంది. దీంతో ఆ క్రేజ్ ని దృష్టిలో ఉంచుకొని వన్ ప్లస్ సంస్థ కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది. దాంతో పాటుగా ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేసిన స్మార్ట్ ఫోన్లపై తగ్గింపు ధరలను ప్రకటిస్తూ వినియోగదారులను విపరీతంగా ఆకర్షిస్తుంది వన్ ప్లస్.

We’re now on WhatsApp. Click to Join

ఇది ఇలా ఉంటే తాజాగా మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి విడుదల చేసింది వన్ ప్లస్ సంస్థ. చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం వన్‌ప్లస్ మార్కెట్లోకి ఎట్టకేలకు కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. వన్‌ప్లస్ నార్డ్‌ సీఈ4 పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. మరీ ఆ వివరాల్లోకి వెళితే..ఈ స్మార్ట్ ఫోన్‌లో ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 ఎస్వోసీ చిప్ సెట్ ప్రాసెసర్‌ను అందించారు. ఇక ఈ స్మార్ట్ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత ఆక్సిజన్‌ ఓఎస్ 14 వెర్షన్‌పై పనిచేస్తుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్‌లో 100 వాట్స్‌ సూపర్‌ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5500 ఎంఏహెచ్‌ కెపాసిటీగల బ్యాటరీని అందించారు.

Also Read: Whatsapp Update: వాట్సాప్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. కొత్త అప్డేట్ తో ఆ సమస్యకి చెక్?

ఇక కెమెరా విషయానికొస్తే.. 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. వన్‌ప్లస్ నార్డ్‌ సీఈ4 స్మార్ట్‌ ఫోన్‌లో 6.7 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌ హెచ్‌డీ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 93.40 శాతం స్క్రీన్ టూ బాడీ రేషియో ఈ స్క్రీన్‌ సొంతం. ఈ స్మార్ట్‌ ఫోన్‌ 5జీ, 4జీ ఎల్టీఈ, డ్యుయల్ బాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.4, జీపీఎస్, గ్లోనాస్, బీడీఎస్, గాలిలియో, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లతో తీసుకొచ్చారు. ఇకపోతే ధర విషయానికొస్తే..

Also Read: Realme 12X: తక్కువ బడ్జెట్ తో అదరగొడుతున్న రియల్ మీ కొత్త స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ ఇవే?

ఈ స్మార్ట్ ఫోన్‌ను 15 నిమిషాలు ఛార్జ్‌ చేస్తే రోజంతా పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది. అలాగే బ్యాటరీ ఫుల్ ఛార్జ్‌ కావడానికి 29 నిమిషాలు పడుతుంది. ధర విషయానికొస్తే.. 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 24,99, 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 26,999గా నిర్ణయించారు. ఏప్రిల్‌ 4వ తేదీ నుంచి అమెజాన్‌లో అందుబాటులో ఉండనుంది.