Site icon HashtagU Telugu

OnePlus 11R: మార్కెట్లోకి వన్ ప్లస్ 11ఆర్.. ధర, ఫీచర్స్ ఇవే?

Oneplus 11r

Oneplus 11r

ప్రముఖ చైనీస్ ఎలక్ట్రానిక్ దిగ్గజం వన్‌ప్లస్ సంస్థ ఇప్పటికి మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్లను అతి తక్కువ ధరకే మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకువస్తుంది ఈ కంపెనీ. ఈ నేపథ్యంలోనే వన్‌ప్లస్ సంస్థ మరొక ఫోను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమయ్యింది. కాగా ఫిబ్రవరిలో జరిగే క్లౌడ్ 11 ఈవెంట్‌లో వన్‌ప్లస్ 11ఆర్ పేరుతో ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేస్తున్నట్లు తెలిపింది. ఈ ఫ్లాగ్‌షిప్ డివైజ్‌లో అద్భుతమైన హై ఎండ్ ఫీచర్స్ ఉన్నాయి. దీంట్లో ADFR 2.0తో 120Hz సూపర్ ఫ్లూయిడ్ డిస్‌ప్లే ఉంటుంది.

ఈ హ్యాండ్‌సెట్ స్నాప్ డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 16 జీబీ వరకు ర్యామ్ ఉంటుంది. అలాగే ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.40వేల నుంచి ప్రారంభం కానుంది. ఇకపోతే ఇందులో కెమెరా విషయానికి వస్తే.. వన్‌ప్లస్ 11ఆర్ ఫోన్‌లో రియర్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 12 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ కెమెరాలు ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫోన్ ముందుభాగంలో 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అమర్చారు. సూపర్-ఫాస్ట్ 100W SUPERVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000mAh బ్యాటరీ సామర్ధ్యంను కూడా కలిగి ఉండనుంది.

ఈ డివైజ్‌లో ఉంటుంది. ఈ ఫోన్ 25 నిమిషాల్లో ఫుల్‌ఛార్జ్ అవుతుంది. అయితే వన్‌ప్లస్‌కు చెందిన క్లౌడ్ 11 ఈవెంట్ ఫిబ్రవరి 7న గ్రాండ్‌గా జరగనుంది. ఈ ఈవెంట్‌లో వన్‌ప్లస్ 11ఆర్ తోపాటు మరికొన్ని ప్రొడక్ట్స్‌ను కంపెనీ లాంచ్ చేయనుంది. ఈ జాబితాలో వన్‌ప్లస్11 5జీ , వన్‌ప్లస్ పాడ్, వన్‌ప్లస్ టీవీ 65 Q2 ప్రో , వన్‌ప్లస్ బడ్స్ ప్రో 2 వంటి ఫ్లాగ్‌షిప్ డివైజ్‌లు ఉన్నాయి. ఇందులో RAM-Vita అనే మెషిన్-లెర్నింగ్ AI ఉంటుంది. ఫోన్ యూజ్ చేసే సమయంలో RAM రీ- అలకేషన్‌ను వేగవంతం చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఫాస్ట్ సిస్టమ్ రెస్పాన్స్ టైమ్, స్టెబిలిటీని అందిస్తుంది. అలాగే హెవీ డ్యూటీ యాప్స్ ఆపరేటింగ్, స్విచ్ఛింగ్‌ ప్రక్రియను స్మూత్‌గా డీల్ చేస్తుంది.