OnePlus: 9వ వార్షికోత్సవం వన్ ప్లస్ ఫోన్లపై భారీగా డిస్కౌంట్..?

చైనా బ్రాండ్స్ లో ఒకటైన వన్‌ప్లస్‌ సంస్థ గురించి మనందరికీ తెలిసిందే. ఈ వన్‌ప్లస్‌ సంస్థ భారత్ మార్కెట్లో అంతంచే

  • Written By:
  • Publish Date - December 16, 2022 / 07:30 AM IST

చైనా బ్రాండ్స్ లో ఒకటైన వన్‌ప్లస్‌ సంస్థ గురించి మనందరికీ తెలిసిందే. ఈ వన్‌ప్లస్‌ సంస్థ భారత్ మార్కెట్లో అంతంచే ప్రజాదారన పొందిన విషయం తెలిసిందే. అయితే ఈ సంస్థ కేవలం స్మార్ట్ ఫోన్లను మాత్రమే కాకుండా స్మార్ట్ వాచెస్, ఇయర్ బడ్స్, టీవీలు, మోనిటర్లు ఇలా అన్ని ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీంతో భారత్‌లో వన్‌ప్లస్‌ బ్రాండ్ కి భారీగా డిమాండ్‌ పెరిగింది. ఇదిలా ఉంటే తాజాగా వన్‌ప్లస్‌ 9వ వార్షికోత్సం సందర్భంగా డిసెంబర్‌ 13 నుంచి 18 వరకు ప్రత్యేక సేల్ నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో భాగంగా పలు గ్యాడ్జెట్లపై క్యాష్‌బ్యాక్‌ డిస్కౌంట్‌లతో భారీగా డిస్కౌంట్‌లను అందిస్తోంది. ఇక ఆ వివరాల విషయానికి వస్తే…

వన్‌ప్లస్ 10టీ, వన్‌ప్లస్ 10ఆర్ పై రూ. 5,000 అలాగే వన్‌ప్లస్ 10 ప్రో 5జీ పై రూ. 6,000 తగ్గింపును అందిస్తోంది. ఇక ఎక్స్చేంజ్ ఆఫర్ కింద ఈ రెండింటిపై దాదాపుగా రూ. 10 వేలు అదనపు తగ్గింపును పొందవచ్చు. ఈ ఆఫర్ డిసెంబర్ 25 వరకు మాత్రమే అందుబాటులో ఉండనుంది. వన్‌ప్లస్ అధికారిక వెబ్ సైట్ OnePlus.in, వన్‌ప్లస్ స్టోర్ యాప్, వన్‌ప్లస్ ఎక్స్‌పీరియన్స్ స్టోర్‌లు, Amazon .in మరియు పార్టనర్ స్టోర్లలో ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. వన్‌ప్లస్ 10టీ 5జీ అసలు ధర రూ. 49,999కాగా, డిస్కౌంట్‌తో రూ. 44,999కి లభించనుంది. 8జీబీ, 128 జీబీ స్టోరేజ్‌తో వచ్చే ఈ స్మార్ట్‌ ఫోన్‌ను ఎక్స్చేంజ్‌ ఆఫర్ లో అదనంగా మరో రూ. 10,000 డిస్కౌంట్‌ పొందొచ్చు.

ఈ స్మార్ట్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే..
6.7 ఇంచెస్ ఫ్లూయిడ్ అమోలెడ్ డిస్ ప్లే, క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్ 1 ప్రాసెసర్‌,50ఎంపీ 8ఎంపీ 2ఎంపీ ట్రిఫుల్ కెమెరా సెటప్ 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా4800 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం ను కలిగి ఉండనుంది. వన్‌ప్లస్ 10 ప్రో 5జీ అసలు ధర రూ. 66,999కాగా, డిస్కౌంట్‌తో రూ. 61,999 కే లభించనుంది. దీనికి బ్యాంక్‌ ఆఫర్‌లను కలుపుకుంటే రూ. 55,999కి సొంతం చేసుకోవచ్చు. అలాగే ఎక్స్చేంజ్‌లో భాగంగా రూ. 10,000 వరకు అదనంగా డిస్కౌంట్‌ పొందవచ్చు. స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. 6.7 ఇంచెస్‌ అమోలెడ్ డిస్‌ప్లే, క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్ 1 ప్రాసెసర్‌ 48ఎంపీ, 50ఎంపీ,8ఎంపీ ట్రిఫుల్ కెమెరా సెటప్ 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యంను కలిగి ఉంది.

వన్‌ప్లస్ నార్డ్ 2టీ 5 జీ అసలు ధర రూ. 28,999కాగా, డిస్కౌంట్‌తో రూ. 25,999కి అందుబాటులో ఉంది. 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ కెపాసిటీ గల ఈ ఫోన్‌పై బ్యాంక్‌ ఆఫర్స్‌లో అదనంగా రూ. 3000 డిస్కౌంట్ పొందొచ్చు. స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. 6.43 ఇంచెస్‌ అమోలెడ్ డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 1300 ప్రాసెసర్‌, 50ఎంపీ, 8ఎంపీ 2ఎంపీ ట్రిఫుల్ కెమెరా సెటప్, 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా 4500 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యంను కలిగి ఉండనుంది. వీటితో పాటు వన్‌ప్లస్‌ బడ్స్‌ ప్రొపై రూ. 8,990, వన్‌ప్లస్‌ బడ్స్‌ జెడ్‌2పై రూ. 4,499, వన్‌ప్లస్‌ నార్డ్‌ బడ్స్‌పై రూ. 2499, వన్‌ప్లస్‌ నార్డ్‌ బడ్స్‌ సీఈపై రూ. 1,899, వన్‌ప్లస్‌ బుల్లెట్స్‌ వైర్‌లైస్‌ జెడ్‌2పై రూ. 1,699, వన్‌ప్లస్ నార్డ్‌ వైర్డ్‌ హెడ్‌ఫోన్స్‌పై రూ. 599, వన్‌ప్లస్‌ నార్డ్‌ వాచ్‌పై రూ. 4,499 చొప్పున డిస్కౌంట్ అందిస్తోంది.