ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వన్ ప్లస్ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. వీటితోపాటు ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది. అందులో భాగంగానే త్వరలోనే మార్కెట్లోకి వన్ ప్లస్ 13 సిరీస్ ను విడుదల చేయబోతోంది. మరి ఆ వివరాల్లోకి వెళితే.. వన్ ప్లస్ వినియోగదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వన్‌ప్లస్ 13 సిరీస్ వంతు రానే వచ్చింది. దీని ప్రారంభ తేదీ వెల్లడైంది. కంపెనీ తన హోమ్ మార్కెట్‌లో అంటే చైనాలో 31 అక్టోబర్ 2024న వన్ ప్లస్ 13ని లాంచ్ చేయబోతోంది.
కానీ ఇండియా ఈ ఫోన్ ఎప్పుడు లాంచ్ అవుతుంది అన్న విషయాన్ని ఇంకా వెల్లడించబడలేదు. అయితే వన్ ప్లస్ 12 సిరీస్ జనవరి 2024లో భారతదేశంలో ప్రారంభించింది. అటువంటి పరిస్థితిలో జనవరి 2025లో భారతదేశంలో వన్ ప్లస్ 13, వన్ ప్లస్ 13ఆర్ లాంచ్ చేయవచ్చని భావిస్తున్నారు. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ ధర విషయానికి వస్తే… వన్ ప్లస్ 13 చైనీస్ వేరియంట్ ధరను టెక్ హోమ్ 100 అనే వినియోగదారు ట్విట్టర్ ఖాతాలో లీక్ చేశారు. చైనాలో వన్ ప్లస్ 13 ధర 4699 యువాన్లు అనగా ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 55,443 గా ఉండనుంది.
చైనాలో వన్ ప్లస్ 12 లాంచ్ ధర 4,299 యువాన్లు అనగా ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 50,714 గా ఉంది. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే..ఈ ఫోన్ అత్యంత ప్రత్యేకమైనదిగా దాని ప్రాసెసర్‌గా ఉండబోతోంది, దీని కోసం కంపెనీ Qualcomm తాజా చిప్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్‌ని ఉపయోగించింది. ఈ చిప్‌సెట్ గరిష్టంగా 24జీబీ LPDDR5X ర్యామ్, 1టీబీ UFS 4.0 స్టోరేజీతో రావచ్చని తెలుస్తోంది. కాగా ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా సరికొత్త ColorOS 15 తో రావచ్చు. ఫోన్ 2కే రిజల్యూషన్ తో X2 8T LTPO AMOLED క్వాడ్ కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఫోన్ 100W వైర్డు, 50W మాగ్నెటిక్ వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇవన్నీ కాకుండా, ఫోన్ వెనుక భాగంలో 50ఎంపీ కెమెరా సెటప్‌ను అందించవచ్చు. ఈ ఫోన్ కి సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.