OnePlus : త్వరలో మార్కెట్లోకి రాబోతున్న వన్‌ప్లస్‌ 12.. లాంచింగ్ డేట్, ఫీచర్స్ పూర్తి వివరాలివే?

వన్‌ప్లస్ 12 (OnePlus 12) పేరుతో లాంచ్‌ చేయనున్నారు. డిసెంబర్‌ 4వ తేదీన ఈ ఫోన్‌ను అధికారికంగా లాంచ్‌ చేయబోతున్నారు.

  • Written By:
  • Publish Date - December 4, 2023 / 07:20 PM IST

OnePlus 12 Series Launching Soon : చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం వన్‌ప్లస్‌ సంస్థ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. మార్కెట్లో కూడా వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ లకు భారీగా డిమాండ్ క్రేజ్ ఉంది. దీంతో ఆ క్రేజ్ ని దృష్టిలో ఉంచుకొని వన్ ప్లస్ సంస్థ కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే త్వరలోనే మరొక సరికొత్త స్మార్ట్ ఫోన్ ని మార్కెట్ లోకి లాంచ్ చేయబోతోంది. మరి ఎప్పుడు లంచ్ చేయబోతున్నారు? ఆ స్మార్ట్ ఫోన్ ధర ఫీచర్ల విషయానికి వస్తే..

We’re Now on WhatsApp. Click to Join.

వన్‌ప్లస్ 12 (OnePlus 12) పేరుతో లాంచ్‌ చేయనున్నారు. డిసెంబర్‌ 4వ తేదీన ఈ ఫోన్‌ను అధికారికంగా లాంచ్‌ చేయబోతున్నారు. వచ్చే ఏడాది జనవరిలో గ్లోబల్‌ లో లాంచ్‌ కానుంది. అయితే భారత్‌ లో ఈ ఫోన్‌లు మార్కెట్ లోకి ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి అన్న విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇక వన్‌ప్లస్‌ 12 లాంచింగ్‌ కంటే ముందే ఈ ఫోన్‌కు సంబంధించిన కొన్ని ఫీచర్లు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. మరి ఆ వివరాల్లోకి వెళితే..

ఈ స్మార్ట్‌ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 3 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను అందించనున్నారు. ఇక ఇందులో 6.7 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను అందించనున్నారు. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ పని చేయనుంది. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ కెమెరా విషయానికొస్తే.. ఇందులో ట్రిపుల్ రెయిర్‌ కెమెరా సెటప్‌ను అందించనున్నారు. ఇందులో 64 మెగాపిక్సెల్‌, 50 మెగాపిక్సెల్‌, 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన కెమెరాలు అందించారు. కాగా ఇందులో 32 మెగాపిక్సెల్స్‌ తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించనున్నారు. ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌ 5400 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉండనుంది.ఈ ఫోన్‌లో పెరిస్కోప్ జూమ్ లెన్స్‌ను అందించారు. దీంతో దూరంలో ఉన్న స‌బ్జెక్ట్స్‌ను కూడా హై క్వాలిటీ ఫొటోల‌ను తీసుకోవచ్చు. ఈ ఫోన్‌లో ప్రత్యేకంగా క‌ర్వ్డ్ డిస్‌ప్లేను అందించారు.

Also Read:  Money Tips: అలాంటి వస్తువులు ఇంట్లో ఉంటే చాలు.. కాసుల వర్షం కురవాల్సిందే?