Site icon HashtagU Telugu

OnePlus 11 5G: మార్కెట్లోకి వన్ ప్లస్ 11 స్మార్ట్ ఫోన్.. ధర ఫీచర్స్ ఇవే?

Oneplus Mobile

Oneplus

స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు వన్‌ప్లస్ స్మార్ట్ ఫోన్ ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వన్ ప్లస్ సంస్థ ఇప్పటికే ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా ఇటీవలే వన్‌ప్లస్ సంస్థ జనవరి 4న చైనాలో లాంచ్‌ చేసిన వన్‌పస్ల్ 11 5జీ సరికొత్త సేల్స్ రికార్డులు క్రియేట్‌ చేసింది. ఫ్లాగ్‌షిప్ సెగ్మెంట్‌లో తీసుకొచ్చిన ఈ హ్యాండ్‌ సెట్‌ను ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 7న లాంచ్ చేయనుంది. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. వన్‌ప్లస్ 11 5జీ మూడు వేరియంట్లలో లాంచ్ లభించనుంది. 128జీబీ 256జీబీ వేరియంట్ ధర చైనా కరెన్సీల CNY 3,999 అనగా మన ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపుగా రూ.48,000 గా ఉంది.

అలాగే 16జీబీ,256జీబీ వేరియంట్ ధర CNY 4,399 అనగా ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపుగా రూ.52,800 గా ఉంది. 16జీబీ 512జీబీ ధర CNY 4,899 అనగా ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపుగా రూ.58,800 గా ఉంది. కాగా ఈ స్మార్ట్ ఫోన్ మనకు ఇన్‌స్టంట్ బ్లూ, ఎండ్‌లెస్ బ్లాక్ వంటి రెండు కలర్ ఆప్షన్స్‌లో లభించనుంది. ఇకపోతే స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. వన్‌ప్లస్ 11 5జీ స్మార్ట్‌ఫోన్ LTPO 3.0 టెక్నాలజీ సపోర్ట్ చేసే 6.7-అంగుళాల 2K, ఫ్లెక్సిబుల్ AMOLED డిస్‌ప్లేతో లభిస్తుంది. కర్వ్‌డ్ స్క్రీన్ 1Hz నుంచి 120Hz మధ్య స్కేల్ చేయగల అనుకూల రిఫ్రెష్ రేట్‌‌తో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్యానెల్ 1300 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 525 PPI పిక్సెల్ డెన్సిటీ‌తో ఉంటుంది. డిస్‌ప్లే గొరిల్లా గ్లాస్ 7 ప్రొటెక్షన్‌తో HDR, డాల్బీ విజన్‌కు సపోర్ట్ చేస్తుంది.

అలాగే ఈ స్మార్ట్ ఫోన్ 5,000 mAh బ్యాటరీ సామర్థ్యం ను కలిగి ఉండ నుంది. ఇది ఆండ్రాయిడ్ 13 బేస్డ్ ColorOS 13‌పై రన్ అవుతుంది. వన్‌ప్లస్‌ 11 5జీ లో రియర్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50 ఎంపీ సోనీ IMX890 సెన్సార్‌ వస్తుంది. ఇది f/1.8 ఎపర్చర్, OIS సపోర్ట్‌తో ఉంటుంది. మిగతా రెండు కెమెరాల్లో 115 డిగ్రీస్ FOVతో కూడిన 48 ఎంపీ అల్ట్రావైడ్ షూటర్, 2x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 32 ఎంపీ టెలిఫోటో యూనిట్ ఉంటుంది. ముందు భాగంలో f/2.4 ఎపర్చర్‌తో 16 ఎంపీ సెల్ఫీ కెమెరాను అమర్చారు.