Site icon HashtagU Telugu

OnePlus: త్వరలో వన్‌ప్లస్‌ రెండు డెస్క్‌టాప్‌ మానిటర్లు.. ధర, ఫీచర్లు ఇవే?

Oneplus

Oneplus

ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్‌ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల అద్భుతమైన ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. మార్కెట్ లో వన్‌ప్లస్‌ బ్రాండ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వన్‌ప్లస్‌ బ్రాండ్ నుంచి విడుదల అయ్యే స్మార్ట్ ఫోన్ లను వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడి కొనుగోలు చేస్తూ ఉంటారు. అలాగే వన్‌ప్లస్‌ తన మార్కెట్ ను మరింతగా విస్తరించుకునేందుకు గట్టిగానే కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా డెస్క్‌టాప్‌ మానిటర్ల విభాగంలో కూడా అడుగుపెట్టబోతోంది. డిసెంబర్​ 12 న కొత్తగా రెండు డెస్క్‌టాప్‌ మానిటర్ లను విడుదల​ చేసేందుకు సిద్దమవుతోంది వన్‌ప్లస్‌ సంస్థ.

వన్‌ప్లస్‌ మానిటర్ ఎక్స్ 27, వన్‌ప్లస్‌ మానిటర్ ఈ24 పేర్లతో మార్కెట్లోకి అందుబాటులోకి విడుదల కానున్నాయి. కాగా ఇదే ఈ విషయాన్ని తాజాగా కంపెనీ తన ట్విట్టర్​ పేజీలో పెట్టిన టీజర్​లో పేర్కొంది. అలాగే అధికారిక వెబ్‌సైట్‌లో కూడా ప్రకటించింది. త్వరలో విడుదల కానున్న వన్‌ప్లస్‌​ మానిటర్ల ఫీచర్లు విషయానికి వస్తే.. వన్‌ప్లస్‌ ఎక్స్​27 మానిటర్​ మోడల్​ 27 ఇంచుల డిస్‌ప్లే తో లభించనుంది. ఇక వన్‌ప్లస్‌ ఎక్స్​ 24మోడల్​ 24 ఇంచుల స్క్రీన్‌ ను కలిగి ఉంటుంది. వీటిలో ఓ మోడల్​ పోట్రయిడ్​ మోడ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ మానిటర్లలో గేమింగ్ ఎక్స్​పీరియన్స్​ అదిరిపోతుంది అని వన్‌ప్లస్‌ తన టీజర్​లో పేర్కొంది.

అయితే వీటి ధరల పై అధికారిక ప్రకటన చేయలేదు. అయినప్పటికీ ఎక్స్​ 27 మానిటర్​ ప్రీమియం రేంజ్​, ఈ24 మానిటర్ మిడ్‌ రేంజ్‌లో లభించనున్నట్లు తెలుస్తోంది. దేశంలోని కొనుగోలుదారుల కోసం ఈ మోడల్‌లను రూ.20 వేల లోపు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా వన్‌ప్లస్‌ సంస్థ తన ప్రోడక్ట్ ను పోర్ట్​ ఫోలియోను క్రమంగా విస్తరించడానికిప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ముందుగా ప్రీమియం స్మార్ట్ ఫోన్ లను రిలీజ్​ చేసింది వన్‌ప్లస్‌ సంస్థ. అలాగే కేవలం రూ.25 వేల ధరలోనే ప్రీమియం ఫీచర్లు గల స్మార్ట్ ఫోన్లను విక్రయించడంతో ఇండియాలో అతి తక్కువ సమయంలోనే మోస్ట్ పాపులర్​ బ్రాండ్‌గా నిలిచింది వన్‌ప్లస్‌ సంస్థ.