Site icon HashtagU Telugu

OnePlus: హమ్మయ్యా.. ఎట్టకేలకు విడుదలైన వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్.. ధర,ఫీచర్స్ ఇవే?

Mixcollage 26 Jun 2024 10 16 Am 1507

Mixcollage 26 Jun 2024 10 16 Am 1507

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం వన్‌ప్లస్‌  సంస్థ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది. దాంతో పాటుగా ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేసిన స్మార్ట్ ఫోన్లపై తగ్గింపు ధరలను ప్రకటిస్తూ వినియోగదారులను విపరీతంగా ఆకర్షిస్తోంది వన్ ప్లస్ సంస్థ. ఇది ఇలా ఉంటే వన్‌ప్లస్ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది.

వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ 4 లైట్ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ను తాజాగా విడుదల చేశారు. ఈ నెల 27వ తేదీ నుంచి తొలి సేల్‌ ప్రారంభం కానుంది. మరి తాజాగా విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఈ ఫోన్‌ ధర విషయానికొస్తే 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 19,999 కాగా 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 22,999గా నిర్ణయించారు. లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా ఏమైనా డిస్కౌంట్స్ ఉంటాయా అనేది చూడాలి మరి. ఇకపోతే వన్‌ప్లస్ నార్డ్‌ సీఈ4 లైట్‌ ఫీచర్ల విషయానికొస్తే..

ఇందులో 6.67 ఇంచెస్‌తో కూడిన అమో ఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 1080పీ రిజొల్యూషన్, 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 2100 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ ఈ స్క్రీస్‌ సొంతం అని చెప్పాలి. ఇక ఇందులో 80వాట్ల ఫాస్ట్ వైర్డ్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే, 5వాట్ల రివర్స్ చార్జింగ్ మద్దతుతో 5,500 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీని అందించారు. బ్రైటర్‌ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇందులో ప్రత్యేకంగా అందించారు.
కాగా విషయానికొస్తే.. ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 50 మెగా పిక్సెల్స్‌తో కూడిన సోనీ ఎల్వైటీ 600 మెయిన్ సెన్సర్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను కూడా అందించారు. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ ఆక్సిజన్ ఓఎస్ 14 వర్షన్‌పై పని చేసే ఈ ఫోన్‌ను సూపర్ సిల్వర్, మెగా బ్లూ, ఆల్ట్రా ఆరెంజ్ కలర్స్‌లో తీసుకొస్తున్నారు.