చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం వన్‌ప్లస్ సంస్థ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. మార్కెట్లో కూడా వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ లకు భారీగా డిమాండ్ క్రేజ్ ఉంది. దీంతో ఆ క్రేజ్ ని దృష్టిలో ఉంచుకొని వన్ ప్లస్ సంస్థ కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది. దాంతో పాటుగా ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేసిన స్మార్ట్ ఫోన్లపై తగ్గింపు ధరలను ప్రకటిస్తూ వినియోగదారులను విపరీతంగా ఆకర్షిస్తుంది వన్ ప్లస్. ఇది ఇలా ఉంటే తాజాగా మార్కెట్లోకి మరోసారి కొత్త స్మార్ట్ ఫోన్ విడుదల చేయబోతోంది వన్ ప్లస్. వన్‌ప్లస్ నార్డ్ ఎన్30ఎస్‌ఈ పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు.
ఇప్పటికే ఈ 5జీ స్మార్ట్ ఫోన్ యూఏఈలో లాంచ్ అయ్యింది. వన్‌ప్లస్ నార్డ్ ఎస్‌ఈ 5జీ ఫోన్ యూఏఈలో విడుదల చేశారు. అయితే ఈ ఫోన్ భారత మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందన్న దానిపై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. మరి ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన ధర ఫీచర్ల విషయానికి వస్తే. వన్‌ప్లస్ నార్డ్3ఎస్‌ఈ 5జీ స్మార్ట్ ఫోన్‌లో 6.72 ఇంచెస్‌తో కూడిన ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్‌ప్లేను ఇచ్చారు. 2,400 x 1,080 పిక్సెల్స్ ఈ స్క్రీన్ సొంతం. ఇక ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ఎస్ఓసీ విత్ మాలి జీ57 ఎంసీ2 జీపీయూతో పనిచేస్తుంది. ఈ ఫోన్‌ను 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీతో లాంచ్ చేశారు. ఆండ్రాయిడ్ 13 బేస్డ్ ఆక్సిజన్ ఓఎస్ 13.1 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేస్తుంది.
డ్యూయల్ స్టీరియో స్పీకర్స్‌తో పాటు 300 శాతం అల్ట్రా వాల్యూమ్ మోడ్‌ను ఇందులో ప్రత్యేకంగా అందించారు. ఇకపోతే కెమెరా విషయానికొస్తే.. ఈ ఫోన్‌లో డ్యూయర్ రియర్ కెమెరా సెటప్‌ను అందించారు. అలాగే 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన ప్రైమరీ కెమెరాతో పాటు 2 మెగాపిక్సెల్స్‌తో కూడిన డెప్త్ సెన్సార్‌ను అందించారు. ఎల్ఈడీ ఫ్లాష్ కూడా అందించారు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ స్మార్ట్ ఫోన్‌లో 8 మెగా పిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. బ్యాటరీ విషయానికొస్తే.. ఇందులో 33 వాట్ సూపర్ ఊక్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని అందించారు.
ఈ స్మార్ట్ ఫోన్‌ను యూఎస్బీ టైప్-సీ పోర్ట్‌తో తీసుకొచ్చారు. స్మార్ట్ ఫోన్ బరువు 193 గ్రాములుగా ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్‌ను సాటిన్ బ్లాక్, సియాన్ స్పార్కిల్ రంగుల్లో లాంచ్ చేశారు. ధర విషయానికొస్తే యూఏఈ మార్కెట్‌లో ఈ ఫోన్ బేస్ వేరియంట్‌ను 599 ఏఈడీలుగా నిర్ణయించారు. మన కరెన్సీలో చెప్పాలంటే రూ. 13,600గా ఉండనుంది. అయితే భారత్‌లో ఈ స్మార్ట్ ఫోన్ ధర కాస్త పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వన్‌ప్లస్ బ్రాండ్ నుంచి రూ. 15వేల లోపు 5జీ స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి రావడం విశేషమనే చెప్పవచ్చు..