One Plus 11 5G: మార్కెట్ లోకి వన్ ప్లస్ 11 5జీ స్మార్ట్ ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే?

స్మార్ట్ ఫోన్ వినియోగదారులలో ఎక్కువ శాతం మంది ఇష్టపడే వాటిలో వన్ ప్లస్ కూడా ఒకటి అని చెప్పవచ్చు. ఇతర

  • Written By:
  • Publish Date - December 21, 2022 / 07:00 AM IST

స్మార్ట్ ఫోన్ వినియోగదారులలో ఎక్కువ శాతం మంది ఇష్టపడే వాటిలో వన్ ప్లస్ కూడా ఒకటి అని చెప్పవచ్చు. ఇతర మొబైల్స్ తో పోల్చుకుంటే వన్ ప్లస్ కెమెరా క్లారిటీ విషయంలో ఏ వన్ గా ఉంటుంది అని చాలామంది వినియోగదారులు అభిప్రాయపడుతూ ఉంటారు. వన్ ప్లస్ కంపెనీ కూడా అందుకు తగ్గట్టుగానే ఎప్పటికప్పుడు కెమెరా విషయంలో డిజైన్ విషయంలో సరికొత్తగా ఆలోచిస్తూ మంచి ఫీచర్స్ కలిగిన మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది. అంతే కాకుండా వన్ ప్లస్ సంస్థ రిలీజ్ చేసిన ఫోన్ల మోడల్స్ ని ఇతర కంపెనీలు కూడా ఫాలో అవుతాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

ఇది ఇలా ఉంటే వన్ ప్లస్ సంస్థ మార్కెట్లోకి వన్ ప్లస్ 11 5జీ స్మార్ట్ ఫోన్ ని తీసుకురానుంది. ఫిబ్రవరి 7న నిర్వహించే క్లౌడ్ 11 ఈవెంట్ వన్ ప్లస్ 11 5జీ ఫోన్ ను ప్రవేశపెడతామని అధికారికంగా వెబ్ సైట్ లో టీజర్ ను రిలీజ్ చేసింది అంటే సంస్థ. దీంతో ఈ ఫోన్ పై అంచనాలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. అయితే ధర విషయంలో ఇప్పటివరకు ఎటువంటి క్లారిటీ ఇవ్వకపోయినప్పటికీ పాత సిరీస్ ఫోన్ కు కాస్త అటు ఇటుగా ఉండే అవకాశాలు ఉన్నట్లుగా ఆ వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఈ ఫోన్ 100 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యము కలిగి ఉండడం ఉంది.

అలాగే 50 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో కస్టమర్లను ఆకర్షిస్తుంది. ఈ మొబైట్ 6.7 అంగుళా డిస్ ప్లే, 120 Hz ప్యానెల్ తో లభించను. ఇప్పటి వరకూ వచ్చిన కొన్ని లీక్స్ బట్టి ఈ ఫోన్ ధర రూ.66,999 గా ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నారు. ఇంతకంటే ఎక్కువగాను అలాగే తక్కువగా ఉన్న కూడా ఆశ్చర్య పోనక్కర్లేదు.