ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్న ప్రతి ఒక్కరి ఫోన్ లో వాట్సాప్ తప్పనిసరి గా ఉంటుంది. వయసుతో సంబంధం లేకుండా చాలామంది ఈ వాట్సాప్ ని వినియోగిస్తున్న విషయం తెలిసిందే. రోజురోజుకీ వాట్సాప్ వినియోగదారుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. చిన్న చిన్న స్మార్ట్ ఫోన్ ల నుంచి పెద్దపెద్ద ఆండ్రాయిడ్ ఫోన్స్ వరకు ప్రతి ఒక్క ఫోన్ లో తప్పనిసరిగా వాట్సాప్ ఉండాల్సిందే. ఇకపోతే ఆ సంగతి పక్కన పెడితే మనం ఎప్పుడైనా కొత్త మొబైల్ ఫోను తీసుకున్నప్పుడు పాత మొబైల్ ఫోన్లో ఉన్న పాత వాట్సాప్ ను కొత్త ఫోన్ లోకి బదిలీ చేయాలని అనుకుంటున్నాం. ఫోన్ మార్చినప్పుడు, చాట్ చరిత్రను బదిలీ చేసేటప్పుడు సమస్యలు తలెత్తుతాయి.
అయితే మీరు దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదట. మీరు ఈ పనిని నిమిషాల్లో పూర్తి చేయవచ్చట. దీని కోసం మీరు పాత, కొత్త ఫోన్ లో వాట్సాప్ ను తెరిచి ఈ విధానాన్ని అనుసరించాలని చెబుతున్నారు. మీరు పాత ఫోన్ నుండి కొత్త ఫోన్‌కి చాట్‌లను బదిలీ చేయాలనుకుంటే, కొన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని చెబుతున్నారు. అయితే ఇందుకోసం ముందుగా మీ కొత్త ఫోన్‌లో వాట్సాప్‌ను ఇన్‌స్టాల్ చేసి, పాత ఫోన్ లో వాట్సాప్ ని ఓపెన్ చేసి మూడు చుక్కలపై క్లిక్ చేసి సెట్టింగ్స్ లోకి వెళ్లి చాట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలట. అయితే అలా కొంచెం క్రిందికి స్క్రోల్ చేస్తే మీకు ట్రాన్స్‌ఫర్ చాట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, నెక్స్ట్ క్లిక్ చేయాలి. స్కానర్ ఓపెన్ అవుతుంది. దీని తర్వాత కొత్త ఫోన్‌లో వాట్సాప్ ఓపెన్ చేసి నంబర్ తో రిజిస్టర్ చేసుకోవాలి.
ఇప్పుడు మీ ఫోన్‌లో పాత ఫోన్ నుండి బదిలీ చాట్ హిస్టరీ ఆప్షన్ ఓపెన్ అవుతుంది. కంటిన్యూ క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ పాత ఫోన్ వాట్సాప్ స్కానర్ లో మీ ముందు తెరుచుకునే QR కోడ్ ను స్కాన్ చేయాలి.పైన పేర్కొన్న దశలను అనుసరించిన తర్వాత మీ పాత వాట్సాప్ చాట్‌లు అన్నీ కొత్త ఫోన్‌కి బదిలీ అవుతాయి. మీరు ఆండ్రాయిడ్ నుండి ఐఫోన్‌కి చాట్‌లను బదిలీ చేయలేకపోతే, మీరు మూవ్ టు iOS యాప్ సహాయం తీసుకోవచ్చు. మీరు యాపిల్ యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్ రెండింటిలోనూ మూవ్ టు iOS యాప్‌ని కనుగొంటారు. మీరు యాప్‌ను తెరిచినప్పుడు సూచనలను అనుసరించాలని చెబుతున్నారు.