Ola Parcel: రైడ్ షేరింగ్ సంస్థ ఓలా కొత్త బిజినెస్ లోకి అడుగుపెట్టింది. ఈ మేరకు కంపెనీ సహ వ్యవస్థాపకులు, CEO భవిష్ అగర్వాల్ ఎక్స్ (X )లో పోస్ట్ చేశారు. అయితే ప్రస్తుతం ఈ సర్వీసులు కేవలం బెంగళూరుకు మాత్రమే పరిమితమని, రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా విస్తరిస్తామని తెలిపారు. పార్సిల్ డెలివరీ చేస్తామని, తొలుత ఐటీ హబ్ బెంగళూర్‌లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. తర్వాత మిగతా నగరాలకు విస్తరిస్తామని కంపెనీ చెబుతోంది.
ఓలా సంస్థ ఓలా పార్సెల్ సర్వీస్ ను ప్రారంభించింది. ఈరోజు బెంగళూరులో ఆల్ ఎలక్ట్రిక్ ఆన్-డిమాండ్ డెలివరీ సర్వీస్ ప్రారంభించినట్లు సంస్థ ప్రకటించింది. భారతదేశం కోసం లాజిస్టిక్ సేవలను విస్తరించే లక్ష్యంతో అలాగే ఓలా పార్శిల్ అత్యంత సరసమైన మరియు అందరికీ అందుబాటులో ఉండే డెలివరీని అందిస్తుందని సంస్థ వెల్లడించింది. ఈరోజు నుండి ఓలా పార్సెల్ సేవ బెంగుళూరు అంతటా అత్యంత సరసమైన ధరలలో అందుబాటులో ఉంటుంది. ధరల విషయానికి వస్తే 5 కి.మీకి రూ.25, 10 కి.మీకి రూ.50, 15 కి.మీకి రూ.75 మరియు 20 కిలోమీటర్లకి రూ.100.గా నిర్దారించింది.
కస్టమర్ల అవసరం మేరకు మొబిలిటీ మరియు లాజిస్టిక్స్ అవసరాలను తీర్చడానికి వినూత్న మరియు సరసమైన ధరలతో ఈ సేవ ప్రారంభించింది. ఈ సేవ ప్రస్తుతానికి బెంగుళూరులో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. రాబోయే కొద్ది నెలల్లో దేశవ్యాప్తంగా ఉన్న నగరాల్లో విస్తరిస్తామని ప్రతినిధులు తెలిపారు. ఓలా ఇటీవల బెంగళూరులో తన ఈ-బైక్ సేవలను ప్రారంభించింది. సామాన్యులకు తక్కువ ధరకు అందుబాటులోకి తెచ్చింది. బెంగళూరు, ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, పూణె, కోల్‌కతా మరియు చెన్నైలలో ప్రారంభించింది. ప్రొఫెషనల్ డ్రైవర్‌లతో కస్టమర్‌లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చినట్టు చెప్పారు.
2011లో సేవలను ప్రారంభించిన తర్వాత, ఓలా మార్కెట్ దినదినాన అభివృద్ధి చెందుతూ వచ్చింది. 200 నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తుంది. అదేవిధంగా 1 మిలియన్ కంటే ఎక్కువ డ్రైవర్లతో భారతదేశంలో అతిపెద్ద రైడ్-హెయిలింగ్ నెట్‌వర్క్‌ను కలిగి ఉంది.
Also Read: Pensions: కాంగ్రెస్ కు చెక్, ఆసరా పెన్షన్ల పెంపుపై కేసీఆర్ యోచన