Ola: ఇదేందయ్యా ఇది ఓలా స్కూటర్ ని ఈ విధంగా ఉపయోగించుకోవచ్చా.. వీడియో వైరల్?

సాధారణంగా బ్రాండ్ అన్నది చాలా ముఖ్యం. ఈ బ్రాండ్ వ్యాల్యూ ని కాపాడుకోవడం కోసం కార్పొరేట్ కంపెనీలు కోట్లు

  • Written By:
  • Publish Date - December 24, 2022 / 07:15 AM IST

సాధారణంగా బ్రాండ్ అన్నది చాలా ముఖ్యం. ఈ బ్రాండ్ వ్యాల్యూ ని కాపాడుకోవడం కోసం కార్పొరేట్ కంపెనీలు కోట్లు గుమ్మరిస్తూ ఉంటాయి. అయితే తన స్ట్రాటజీ తో మార్కెట్లో ఎన్నో రకాల వస్తువుల విషయంలో బ్రాండ్ ను క్రియేట్ చేయడంలో ఓలా సంస్థ సీఈవో భవిష్ అగర్వాల్ సమర్థుడు అని చెప్పవచ్చు. ఓలా కంపెనీ ప్రస్తుతం ఇది మార్కెట్లో కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఎలక్ట్రిక్ స్కూటర్ల విషయంలో గత ఐదేళ్లుగా ఎన్నో రకాల కంపెనీలు ప్రయత్నించినప్పటికీ ఓలా మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత పరిస్థితి మొత్తం మారిపోయింది. ఎలక్ట్రిక్ స్కూటర్లను ఇంకా మార్కెట్లోకి తీసుకురాక ముందే ఫ్రీ బుకింగ్ లోనే లక్షల్లో ఆర్డర్ లను
సాధించింది ఓలా సంస్థ.

ఇకపోతే గత ఏడాది నాసిరకం వెహికల్స్ ఓలా వారు తయారు చేశారు అని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఓలా వెహికల్ తో పెట్టుకుంటే ప్రాణాలు పణంగా పెట్టాల్సి వస్తుందేమో అన్న అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి. దాంతో బరిలోకి దిగిన ఓలా సీఈవో భవిష్ అగర్వాల్ తన బ్రాండ్ ని ప్రోడక్ట్ వ్యాల్యూ ని మార్పులు చేశారు. స్కూటర్ల విజయ ప్రస్థానాన్ని రోజుకు ఒక విధంగా వివరిస్తూ వస్తున్నారు. నేపథ్యంలోనే తాజాగా ఓలా స్కూటర్ ను ఏ విధంగా క్రియేటివ్ గా వినియోగించుకోవచ్చు అన్న విషయాన్ని తెలుపుతూ ఒక వీడియోని విడుదల చేశారు.

 

ఆ వీడియోలో ఓలా స్పీకర్లను ఉపయోగించి ఒక యువకుడు లైవ్ క్రికెట్ కామెంటరి ఇవ్వడంతో నెటిజన్స్ ని ఆ వీడియో విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఒడిస్సా రాష్ట్రానికి చెందిన ఒక ప్రాంతంలో యువకులు గ్రౌండ్లో క్రికెట్ ఆడుతున్నారు. అయితే గ్రౌండ్ సమీపంలో పార్కు చేసిన ఒక ఓలా స్కూటర్ వైర్లెస్ స్పీకర్ ఫీచర్ సహాయంతో ఆ వెహికల్ పక్కన యువకుడు ఫోన్లు క్రికెట్ కామెంటరి ఇవ్వడం ప్రస్తుతం వైరల్గా మారింది. నాకు సంబంధించిన వీడియోని భవిష్ షేర్ చేస్తూ.. మా వెహికల్ ని అత్యంత సుజనాత్మకంగా వినియోగించుకోవడం తొలిసారి చూస్తున్నాను అని ట్విట్ చేశారు.