Ola Electric Scooter: ఐదు రకాల కలర్లతో సరికొత్త లుక్ లో ఓలా.. ఫీచర్స్ ఇవే?

దేశవ్యాప్తంగా వాహనదారులు ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాల వైపే ముగ్గు చూపుతున్నారు. దాంతో ప్రస్తుతం మార్కెట్ అంతా

Published By: HashtagU Telugu Desk
Ola Electric Scooters

Ola Electric Scooter

దేశవ్యాప్తంగా వాహనదారులు ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాల వైపే ముగ్గు చూపుతున్నారు. దాంతో ప్రస్తుతం మార్కెట్ అంతా కూడా ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ నడుస్తుండడంతో ఆయా కంపెనీలు అందుకు తగ్గట్టుగానే సరికొత్త ఫీచర్స్ హంగులతో కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. అయితే ఈ ఎలక్ట్రిక్ వాహనాల ఫీచర్ల విషయంలో ఓలా సంస్థ ఒక అడుగు ముందే ఉంటుంది అని చెప్పవచ్చు. అందుకే ఎలక్ట్రిక్ వాహనం తయారీ సంస్థలో దేశంలోనే నెంబర్ వన్ ఈవీగా నిలిచింది ఓలా.ఈ క్రమంలోనే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఎస్1 కు సంబంధించి ఓ ప్రత్యేక అప్ డేట్ ఇచ్చింది.

ఓలా సంస్థ ఎలక్ట్రిక్ కంపెనీ తన ఓలా ఎస్ 1 వేరియంట్ ను ఐదు కొత్త రంగులలో ఆవిష్కరించినట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న కలర్స్ కు అదనంగా మార్ష్‌మల్లో, మిలీనియల్ పింక్, ఆంత్రాసైట్ గ్రే, మిడ్‌నైట్ బ్లూ , మ్యాట్ బ్లాక్ లలో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపింది. ఈ ఐదు రంగులతో కలపి ఇప్పటి వరకూ ఓలా ఎస్1 స్కూటర్ మొత్తం 11 రంగుల్లో వినియోగదారులకు లభించనుంది. అయితే వినియోగదారుల అభిరుచుల మేరకు ఎప్పటికప్పుడు తమ ఉత్పత్తులలో అప్గ్రేడ్ చేస్తూ ఉంటుంది ఓలా. తమ ఎస్1, ఎస్1 ప్రో వేరియంట్లో గెరువా ఎడిషన్ ను ఆవిష్కరించింది. ఇకపోతే గత ఏడాది అనగా 2022లో ఓలా కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో దేశంలోనే నంబర్ పొజిషన్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

మొత్తం 1,50,000 యూనిట్లను విక్రయించి రికార్డు నెలకొల్పింది ఓలా. ఈ ఓలా ఎస్1 వివరాల విషయానికొస్తే.. ఓలా ఎస్1 కేవలం 3 సెకన్లలో 0 kmph నుంచి 40kmph వరకు వెళ్లగలదు. అలాగే గరిష్టంగా 115 కి.మీ. వెళ్లగలదు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎలక్ట్రిక్ స్కూటర్ 181 కిమీల వరకు వెళ్తుంది. దీనిలో రివర్స్ మోడ్‌, హిల్ హోల్డ్ ఫీచర్లు ఉంటాయి. నార్మల్, స్పోర్ట్, హైపర్‌ మోడ్స్‌లో పనిచేస్తుంది. అయితే చార్జ్ చేయడం కోసం ఫాస్ట్ ఛార్జర్‌ను ఉపయోగించడం ద్వారా కస్టమర్‌లు కేవలం 18 నిమిషాల్లో 50శాతం రీచార్జ్ చేసుకోవచ్చు.

  Last Updated: 08 Jan 2023, 08:22 PM IST