Ola S1 Pro: బంపర్ ఆఫర్ ప్రకటించిన ఓలా..ఎస్1 ప్రోపై భారీ తగ్గింపు?

ప్రముఖ క్యాబ్ సర్వీసుల సంస్థ ఓలా తాజాగా వినియోగదారుల కోసం ఒక బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. తన ఫ్లాగ్ షిప్

Published By: HashtagU Telugu Desk
Ola Electric Shock

Ola Electric Shock

ప్రముఖ క్యాబ్ సర్వీసుల సంస్థ ఓలా తాజాగా వినియోగదారుల కోసం ఒక బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. తన ఫ్లాగ్ షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్ పై డిస్కౌంట్ ను అందిస్తున్నట్లుగా తాజాగా ప్రకటించింది. ప్రస్తుతం దసరా నవరాత్రుల ఉత్సవాల కారణంగా ఫెస్టివల్ సీజన్లో కస్టమర్లను ఆకట్టుకునే విధంగా ఓలా ఎస్ 1ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ ను 10000 వరకు తగ్గింపు దరకు అందిస్తాము అని బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. ఎస్ 1 ప్రో లాంచింగ్ ధర ఎక్స్ షోరూం రూ.1.40 లక్షలు.

కాగా తాజాగా ఫెస్టివల్ ఆఫర్ తో ఈ స్కూటర్ ని పదివేల రూపాయలు తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు అని ప్రకటించింది ఓలా సంస్థ. ఇదే విషయాన్ని ఓలా ఎలక్ట్రిక్ సంస్థ తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ప్రకటించింది. ఈ సందర్భంగా ట్వీట్ చేస్తూ..ఓలా పండుగ ఆఫర్‌ను ఉపయోగించుకోండి. ఎస్‌ 1 ప్రో రూ. 10,000 తగ్గింపుతో పండగ చేస్కోండి. ఇతర ఫైనాన్స్ ఎంపికలు కూడా ఉన్నాయి. ఈ ఆఫర్ దసరా అక్టోబర్ 05, 2022 వరకు మాత్రమే చెల్లుబాటులో ఉంటుంది అని పేర్కొంది ఓలా సంస్థ.

అయితే ఈ ప్రత్యేకమైన ఆఫర్ ని పొందడానికి వినియోగదారులు ముందుగా ఓలా అధికారిక వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి, పండుగ ఆఫర్ ట్యాబ్ పై క్లిక్ చేసిన తర్వాత ఆసక్తిగల కస్టమర్లు ఎస్ 1 ప్రో ని డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేసే ఆప్షన్ ఎంచుకోవాలి అని తెలిపింది ఓలా. ఆ తర్వాత వివరాలను నమోదు చేసుకుని ఎస్ 1 ప్రోని 1.30 లక్షలకు కొనుగోలు చేయవచ్చని తెలిపింది.

  Last Updated: 27 Sep 2022, 04:50 PM IST