Site icon HashtagU Telugu

Ola Scooter: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ పై అదిరిపోయే ఎక్స్చేంజ్ ఆఫర్.. ప్రాసెస్ విధానం ఇదే?

Ola Scooter

Ola Scooter

దేశవ్యాప్తంగా రోజురోజుకీ ఇంజన్ ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో వాహన వినియోగదారులు ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే చాలామంది ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలలో మరి ముఖ్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్ ల వినియోగం అయితే మరింత పెరిగిపోతోంది. అయితే ఇంతవరకు బాగానే ఉంది కానీ చాలామంది ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలనుకునే ముందు ఇప్పుడున్న వాహనాన్ని ఏం చేయాలి అన్న సందేహం నెలకొంటోంది. ఎలక్ట్రిక్ స్కూటర్ ను కొనాలనుకునే సమయంలో వారు ఎక్స్ చేంజ్ ఆఫర్ చేయరు. ఎక్స్ చేంజ్ లో అయితే ఎక్కువ డబ్బు వస్తుంది.

అలా అని బయట అమ్మితే అంత డబ్బు రావడం లేదని సగటు కొనుగోలుదారులు ఆవేదన చెందుతున్నారు. అటువంటి వారికోసం ఓలా కంపెనీ పెట్రోల్ స్కూటర్ పై భారీ ఎక్స్ చేంజ్ ఆఫర్ ను కల్పిస్తుంది. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇందుకోసం మీరు ముందుగా మీ పాత స్కూటర్ ను మొదటిగా ఓలా ఎక్స్ పీరియన్స్ సెంటర్ కు తీసుకెళ్లాలి. అక్కడ ఉండే సిబ్బంది మీ బండి స్థితిని, తిరిగిన కిలోమీటర్లను, కంపెనీను బేరీజు వేసుకుని ధరను నిర్ణయిస్తారు. ఓలా స్కూటర్ ధరలో నుంచి నిర్ణయించిన ధరను మినహాయించి మిగిలిన మొత్తాన్ని చెబుతారు. అది మీకు సమ్మతమైతే మిగిలిన మొత్తాన్ని చెల్లించి హ్యాపీగా మీరు కొత్త ఓలా స్కూటర్ ను కొనుగోలు చేయవచ్చు.

అయితే మీరు ఓలా ఎక్స్పీరియన్స్ సెంటర్ లోకి వెళ్ళి అక్కడ ఓలా ఎస్ 1 స్కూటర్ ను టెస్ట్ రైడ్ చేయవచ్చు. అలాగే ఈఎంఐ ఎంపికలో ఎస్ 1 డాక్యుమెంటేషన్, బ్యాంక్ ఫైనాన్సింగ్, స్కూటర్ డోర్ డెలివరీ వంటి సేవలను పొందవచ్చు. ఈ స్కూటర్ రెగ్యులర్ చెక్ అప్, అలాగే సర్వీసింగ్ వంటి సేవలను కూడా పొందవచ్చు. మారి ఓలా ఎస్ 1 స్పెసిఫికేషన్ ల విషయానికి వస్తే.. ఈ ఓలా ఎస్ 1 స్కూటర్ ధర రూ.84,999 గా ఉంది. అయితే మొదట కేవలం రూ.1999 చెల్లించి దీన్ని మీరు ఈఎంఐలో కొనుగోలు చేయవచ్చు. ఈ స్కూటర్ ఒక్కసారి చార్జ్ చేస్తే ఈ స్కూటర్ 181 కిలో మీటర్లు వెళ్తుంది. అలాగే గంటకు గరిష్టంగా 116 కిలో మీటర్ల వేగంతో వెళ్తుంది.

Exit mobile version