Hawk Lite: రూ.2 వేలకే హాక్ లైట్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర, ఫీచర్స్ ఇవే?

భారత మార్కెట్లోకి ప్రతినెల పదుల సంఖ్యలో కొత్త కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు విడుదల అవుతూనే ఉన్నాయి. ఒకదాని నుంచి

  • Written By:
  • Publish Date - February 23, 2023 / 07:00 AM IST

భారత మార్కెట్లోకి ప్రతినెల పదుల సంఖ్యలో కొత్త కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు విడుదల అవుతూనే ఉన్నాయి. ఒకదాని నుంచి మరొకటి అద్భుతమైన ఫీచర్లతో అతి తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎలక్ట్రిక్ బైకులు విడుదల అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా మార్కెట్ లోకి మరో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల అయ్యింది. ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ పేరు హాక్ లైట్. మరి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర ఫీచర్స్ విషయానికి వస్తే.. 1800 వాట్స్ మోటర్ పవర్ ఉంది. కీలెస్ స్టార్టింగ్ సిస్టం ఉంది. దీని ఇంజిన్ 44Nm టార్క్ ఇస్తోంది. పీక్ పవర్ 1900 వాట్స్ ఉంది.

కాగా ఈ స్కూటర్ మాగ్జిమం స్పీడ్ గంటకు 45 కిలోమీటర్లుగా ఉంది. దీనికి ఫ్రంట్ బ్రేక్ డిస్క్ బ్రేక్ ఉండగా రియర్ బ్రేక్ డ్రమ్ బ్రేక్ కూడా ఉంది. హాక్ లైట్‌ 4 కలర్స్‌లో లభిస్తోంది. చార్‌కోల్ బ్లాక్, గ్రావిటీ గ్రే, ఇంటెన్స్ రెడ్, మిరేజ్ వంటి కలర్స్ లో లభించనుంది. మొబైల్ ఛార్జర్ పాయింట్ ఉంది. మ్యూజిక్ సిస్టం కూడా ఉంది. ఈ స్కూటర్‌కి బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది. అలాగే ఛార్జర్ పాయింట్ ఉంది. మ్యూజిక్ సిస్టం కూడా ఉంది. ఈ స్కూటర్‌కి డిజిటల్ స్పీడోమీటర్ ఉంది. క్రూయిజ్ కంట్రోల్ కూడా ఉంది. ఈ స్కూటర్ పొడవు 1900mm కాగా వెడల్పు 730mm ఉంది. ఎత్తు 1130mm ఉంది. బరువు 128కేజీలు. అలాయ్ వీల్ రిమ్ ఉంది. దీని లోడింగ్ కెపాసిటీ 150 కేజీలు.

ఈ స్కూటర్‌ను రిమోట్ స్టార్ట్ చెయ్యవచ్చు. పుష్ బటన్ స్టార్ కూడా ఉంది.ఇది ఒకటే పెద్ద సింగిల్ సీట్‌తో ఉంది. అందువల్ల ఇద్దరు ప్రయాణించడానికి అనుకూలంగా ఉంది. ప్యాసింజర్ బ్రేక్‌రెస్ట్ కూడా ఉంది. ఈ స్కూటర్‌కి ట్యూబ్‌లెస్ టైర్స్ ఉన్నాయి. కాగా ఈ స్కూటర్ ధరను రూ.99,400గా ఉంది. అయితే దీనిని రూ.2000తో బుక్ చేసుకొని ఇంటికి తీసుకెళ్లోచ్చని తెలిపింది. అయితే తక్కువ ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలి అనుకున్న వారికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చు.