Worlds Smartest Pen : ఎంత డిజిటల్ యుగమైనా.. పెన్ను లేనిదే పని జరగదు. దానికున్న ప్రాధాన్యం దానికి ఉంటుంది. ఇప్పుడు టీవీల నుంచి మొదలుకొని స్మార్ట్ ఫోన్ల దాకా.. చేతి గడియారాల నుంచి మొదలుకొని వంటగది దాకా ప్రతీదీ ‘స్మార్ట్’ టెక్నాలజీతో శోభను సంతరించుకుంటున్నాయి. పెన్ను కూడా అందుకు మినహాయింపేం కాదు. నెదర్లాండ్స్ దేశానికి చెందిన న్యూవా కంపెనీ(Worlds Smartest Pen) అత్యాధునిక స్మార్ట్ పెన్నును తయారు చేసింది. దాన్నిఇటీవలే అమెరికాలోని లాస్ వెగాస్‌లో జరిగిన కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో(సీఈఎస్)-2025లో ప్రదర్శించింది. ఈ పెన్ను విశేషాలను ఈ కథనంలో తెలుసుకుందాం..
Also Read :Sukesh Income : నా ఆదాయం రూ.7,640 కోట్లు.. పన్ను చెల్లిస్తా తీసుకోండి.. సుకేశ్ సంచలన లేఖ
మూడు కెమెరాలు ఏం చేస్తాయి ?
న్యూవా పెన్ మామూలుగా ఉండదు. అందులో ఏకంగా మూడు కెమెరాలు ఉంటాయి. ఈ కెమెరాలు మనం రాసే ప్రతీ పదాన్ని షూట్ చేస్తాయి. వాటి వీడియోలను సేవ్ చేస్తాయి. ఈ వీడియోలను చూసేందుకు మనం న్యూవా పెన్ మొబైల్ యాప్‌లోకి లాగిన్ కావాలి. ఈ పెన్నుతో మనం ఏదైనా రాసి మర్చిపోయినా నో ప్రాబ్లమ్. ఎందుకంటే మనం రాసినవన్నీ వీడియో రూపంలో రికార్డయ్యాయి. న్యూవా మొబైల్ యాప్‌లోకి వెళ్లి మన చేతిరాత నోట్సుకు సంబంధించిన వీడియోను ఓపెన్ చేసి చూసుకోవచ్చు. చాలా వీడియో ఫైల్స్ సేవ్ అయి గందరగోళంగా అనిపిస్తే.. గతంలో మనం రాసిన చేతిరాత నోట్సులోని ఏవైనా ఒకటి, రెండు పదాలను సెర్చ్ బాక్స్‌లో ఎంటర్ చేయాలి. దీంతో వెంటనే ఆ పదాలతో కూడిన నిర్దిష్ట ఫైల్ మన ఎదుట డిస్‌ప్లే అవుతుంది.
Also Read :Case File on Venkatesh : హీరో వెంకటేష్ పై కేసు నమోదు
చేతిరాత నేరుగా డిజిటల్ ఫార్మాట్‌లోకి
సాధారణంగానైతే మన చేతిరాతను డిజిటల్ రూపంలోకి మార్చేందుకు.. చేతిరాత ఉన్న పేపరును ప్రత్యేకంగా స్కాన్ చేయించాల్సి ఉంటుంది. ఈ పెన్ను ఉంటే ఆ అవసరం ఉండదు. ఎందుకంటే న్యూవా పెన్నుతో రాసిన పదాలన్నీ అప్పటికప్పుడు డిజిటల్ రూపంలోకి మారిపోయి, దాని మొబైల్ యాప్‌లో సేవ్ అవుతాయి. మనం చేతిరాత నోట్సును నేరుగా డిజిటల్ ఫార్మాట్‌లో పొందొచ్చు. దాన్ని మనకు అవసరమైన విధంగా వాడుకోవచ్చు. ప్రింట్ తీసుకోవచ్చు. సోషల్ మీడియాలో షేర్ చేసుకోవచ్చు.