Site icon HashtagU Telugu

Nuclear Hotel: అన్ని విమానంలోనే.. సినిమా హల్ నుంచి స్విమ్మింగ్ ఫుల్ వరకు?

43ad5a51 5735 46da Bde9 Cfc4032d693d

43ad5a51 5735 46da Bde9 Cfc4032d693d

మామూలుగా సముద్రంలో ప్రయాణించే పెద్ద పెద్ద షిప్ లలో తినుబండారాల నుంచి స్విమ్మింగ్ పూల్ సినిమా హాల్ వరకు ప్రతి ఒక్కరికి ఉంటాయి తెలిసింది. క్రూయిజ్ షిప్ గురించి మనందరికీ తెలిసిందే. ఈ క్రూయిజ్ షిప్ తరహాలో వందల క్యాబిన్ లు, సినిమా హాల్లు, స్విమ్మింగ్ పూల్ లో, షాపింగ్ సౌకర్యాలు, అబద్ధాలతో కూడిన బాల్కనీలు, అబ్బో అనిపించే విధంగా సకల సౌకర్యాలు అయితే ఇవన్నీ ఉండేది ఒక విమానంలో. విమానం ఏంటి ఈ సౌకర్యాలు ఏంటి అని అనుకుంటున్నారా! మీరు విన్నది నిజమే..యెమెన్ కు చెందిన ప్రమేఖ సైన్స్ ఇంజనీర్ హషీమ్ అల్ ఘాయిలీ దీనిని డిజైన్ చేశారు. దీనికి సంబంధించి ఓ గ్రాఫిక్స్ వీడియోను రూపొందించి సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం ఆ వీడియో నెటిజన్ లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

పెద్ద సంఖ్యలో షేర్లు, లైక్ లు వస్తున్నాయి. దాని పేరు స్కై క్రూయిజ్. విమానం మాదిరిగా గాలిలో ఎగురుతూ అత్యంత విలాస వంతమైన క్రూయిజ్ షిప్ లలో ఉండే సకల సౌకర్యాలను అందించే ఈ సరికొత్త హోటల్ కు స్కై క్రూయిజ్‌ అని పేరు పెట్టారు. ఇంకా ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏమిటంటే స్కై క్రూయిజ్ పిలవబడే ఈ విమానంలో ఒకేసారి ఐదు వేల మంది ప్రయాణించడానికి వీలుగా ఉంటుందట. దీంతో దానిని బాహుబలి హోటల్ గా అభివర్ణిస్తున్నారు. అంతేకాదు ఈ విమానం ఆకాశంలో ఏళ్ల తరబడి నిరంతరాయంగా ఎగరగలుగుతుందని డిజైనర్ చెప్తున్నారు. ఇందుకోసం అణు ఇంధనంతో నడిచే 20 ప్రత్యేక ఇంజన్లను వినియోగించాల్సి ఉంటుందని చిన్నపాటి అణు రియాక్టర్‌ ను వినియోగిస్తే సరిపోతుందని అంటున్నారు.

ప్రయాణికులు, సరుకులను చిన్న విమానాల ద్వారా ఈ భారీ విమానంలోకి చేరుస్తారట. ఏమైనా ఎమర్జెన్సీ వస్తే ప్రయోజనం ఉండేలా ఓ ఆస్పత్రి కూడా ఉంటుందట. ఈ విమానంలో భారీ షాపింగ్‌ మాల్‌, రెస్టారెంట్లు, ప్లేగ్రౌండ్లు, బార్లు, సినిమా హాళ్లు, స్విమ్మింగ్‌ పూల్ వంటివి ఉంటాయని డిజైనర్ చెప్పారు. ఇక విమానం తోక భాగంలో ఉండే భారీ డెక్‌ నుంచి 360 డిగ్రీల కోణంలో చుట్టూ ఉన్న ప్రపంచాన్ని వీక్షించవచ్చని వివరించారు. విమానం మధ్య లోపలికి వెలుతురు ప్రసరించేలా అద్దాలను అమర్చనున్నారు. మొత్తానికి ఈ స్కై క్రూయిజ్ విమానం నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.

Exit mobile version