Aadhaar: ఆధార్ వినియోగదారులకి గుడ్ న్యూస్.. ఇకపై ఆ విషయంలో నో టెన్షన్?

కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆధార్ వినియోగదారులకు మరోసారి శుభవార్తను తెలిపింది. గతంలో చాలాసార్లు ఆధార్ కార్డును అప్డేట్ చేసుకునే వెసులుబాటును క

  • Written By:
  • Publish Date - March 12, 2024 / 09:13 PM IST

కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆధార్ వినియోగదారులకు మరోసారి శుభవార్తను తెలిపింది. గతంలో చాలాసార్లు ఆధార్ కార్డును అప్డేట్ చేసుకునే వెసులుబాటును కల్పించిన కేంద్ర ప్రభుత్వం ఆ గడువును పెంచుకుంటూ వస్తూనే ఉంది. అయితే ఇటీవలే మార్చి 14 వరకు మాత్రమే ఈ గడువు ఉంటుందని తెలిపిన కేంద్ర ప్రభుత్వం తాజాగా శుభవార్తను చెబుతూ మరొక నిర్ణయం తీసుకుంది. ఉచిత ఆధార్ అప్డేట్ కు మార్చి 14తో ముగించకుండా జూన్ 14, 2024 వరకూ పొడిగించింది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథార్టీ ఆఫ్ ఇండియా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల జూన్ 14 వరకూ ఆధార్ కార్డుల్లో మార్పులను ఉచితంగానే చేసుకోవచ్చు.

ప్రతి భారతీయ పౌరుడు తప్పనిసరిగా ఆధార్ కార్డును తప్పులు లేకుండా కలిగి ఉండాలి, ఎందుకంటే ఇది వారి సమాచారానికి ప్రూఫ్‌గా ఉంటోంది. ఆధార్‌లో ప్రత్యేకమైన 12 అంకెల సంఖ్య ఉంటుంది. ఆ సంఖ్యకు బయోమెట్రిక్‌కి లింక్ ఉంటుంది. ఆ లింక్ ఆధారంగా ఆ వ్యక్తి వివరాలు, వేలిముద్రలు, కంటి చూపు వివరాలు అన్నీ లభిస్తాయి. అయితే పదేళ్ల కిందట ఆధార్ కార్డును పొంది, అందులో ఏదైనా సమాచారాన్ని అప్‌డేట్ చేయాలనుకునే వ్యక్తులు, ఇప్పుడు ఉచితంగానే చేయించుకోవచ్చు. ఇది UIDAI పోర్టల్ ద్వారా వీలవుతుంది. లేదా ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లి, ఆన్‌లైన్‌లో చేయించుకోవచ్చు. మీ పేరు, చిరునామా, మొబైల్ నంబర్, ఇమెయిల్ ID, లింగం, పుట్టిన తేదీ వంటి ప్రాథమిక సమాచారం మాత్రమే కాకుండా, ప్రజలు తమ ప్రస్తుత కార్డుకు కొత్త బయో మెట్రిక్‌లను లను కూడా లింక్ చేసుకోవచ్చు.

జూన్ 14 వరకూ ఉచితంగా మార్పులు చేయించుకోవచ్చు. ఆ తర్వాత ఇలా చెయ్యాలంటే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఆధార్ కార్డుకి ఆన్‌లైన్‌లో మార్పులు చేయించుకోవాలి అనుకుంటే.. UIDAI అధికారిక సైట్ https://uidai.gov.in లోకి వెళ్లాలి. ఆధార్ నంబర్ ఎంటర్ చెయ్యాలి. ఆధార్‌తో లింక్ అయిన మొబైల్‌కి ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చెయయాలి. తర్వాత మీ ప్రొఫైల్ లోకి వెళ్లాలి. అక్కడ అన్నీ కరెక్టుగానే ఉన్నాయి అనుకుంటే, మీరు ఐ వెరిఫై దట్ ది అబోవ్ డిటైల్స్ అర్ కరెక్ట్ అనే బాక్సుకి టిక్ చెయ్యాలి. ఒకవేళ ఏవైనా మార్పులు చెయ్యాలంటే, చేసుకొని, డ్రాప్ డౌన్ మెనూ ద్వారా.. మీరు చేసిన మార్పులకు ఆధారంగా ఇచ్చే డాక్యుమెంట్లను అప్‌లోడ్ చెయ్యాలి. ఈ డాక్యుమెంట్లు JPEG, PNG, PDF ఫార్మాట్‌లో ఉండొచ్చు. అలాగే ఫైల్ సైజు 2 MB కంటే తక్కువ ఉండాలి. ఇలా అన్ని మార్పులూ చేసుకున్నాక.. submit ట్యాబ్‌పై క్లిక్ చెయ్యాలి. ప్రక్రియ పూర్తైన తర్వాత మీరు తాజా ఈ-ఆధార్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీరు మీసేవా కేంద్రాలకు వెళ్లి కూడా ఈ మార్పులు చేయించుకోవచ్చు. అక్కడికి వెళ్లే ముందే.. ప్రూఫులకి సంబంధించిన పత్రాలు కూడా వెంట తీసుకెళ్లండి. సాధారణంగా మీసేవా కేంద్రాల్లో స్కానింగ్, జిరాక్స్ వంటివి ఉంటాయి. కాబట్టి.. ప్రూఫ్ పత్రాలను వారే అప్‌లోడ్ చేసి, మీ పనిని పూర్తి చేస్తారు. ప్రక్రియ పూర్తైన తర్వాత మీరు తాజా ఈ-ఆధార్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.