Site icon HashtagU Telugu

Hyderabad Metro rail ticket booking via WhatsApp: ఇకపై వాట్సాప్ ద్వారా హైదరాబాద్ మెట్రో టికెట్స్ బుకింగ్..ఎలా అంటే?

Hyderabad Metro Rail Ticket Booking Via Whatsapp

Hyderabad Metro Rail Ticket Booking Via Whatsapp

టెక్నాలజీ డెవలప్ అవ్వడంతో మెట్రో రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే మొదట్లో పెద్ద పెద్ద నగరాలలో ఉన్న ఈ మెట్రో ట్రైన్స్ క్రమంగా బెంగళూరు,హైదరాబాద్ వంటి నగరాలలోకి కూడా వచ్చేసాయి. ఈ మెట్రో రైల్స్ లో నిత్యం లక్షలాదిమంది ప్రయాణిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ప్రయాణికులు కొన్ని కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. అటువంటి వారికి తాజాగా ఒక మంచి సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ మెసేజింగ్ ఆప్ వాట్సప్ ద్వారా మెట్రో టికెట్స్ ని బుక్ చేసుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చింది.

అయితే వేరే యాప్ ఏమి అవసరం లేకుండా వాట్స్అప్ ద్వారానే టికెట్స్ బుక్ చేసుకునే సదుపాయాం అందుబాటులోకి వచ్చింది. కాగా ఇండియాలో వాట్సాప్‌ ద్వారా ఫుల్లీ డిజిటల్ పేమెంట్ ఎనేబుల్డ్ ఈ టికెటింగ్ ఫెసిలిటీ తెచ్చిన తొలి మెట్రోగా హైదరాబాద్ మెట్రో రైల్ నిలిచింది. ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్‌ బిల్ఈజీ తో ఇందుకోసం హైదరాబాద్ మెట్రో భాగస్వామ్యం ఏర్పరుచుకుంది. దీంతో ప్రయాణికులు ఇప్పుడు వాట్సాప్‌ ద్వారానే హైదరాబాద్ మెట్రో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇందుకోసం స్మార్ట్ ఫోన్‌ లో వాట్సాప్‌ యాప్‌ ఓపెన్ చేసి హైదరాబాద్ మెట్రో రైల్ నంబర్ +91 8341146468 కు హాయ్ అని మెసేజ్ చేయండి.

అయితే ఆ నెంబర్కు మెసేజ్ చేయడానికి అంటే ముందుగా ఆ నెంబర్ ను సేవ్ చేసుకోవాలి. లేదంటే మైట్రో స్టేషన్‌లలో ఏర్పాటు చేసిన QR కోడ్‌ను స్కాన్ చేసినా కూడా సరిపోతుంది.ఆ నంబర్‌కు హాయ్ అని మెసేజ్ చేసిన తర్వాత ఈ టికెటింగ్ కోసం ఒక యూఆర్‌ఎల్‌ వాట్సాప్ చాట్‌ లోనే వస్తుంది. ఆ యూఆర్‌ఎల్‌ పై క్లిక్ చేస్తే ఈ-టికెట్ గేట్‌ వే వెబ్‌ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారో జర్నీ రూట్‌ ను ఆ వెబ్‌పేజ్‌లో ఎంటర్ చేయాలి. అనంతరం ప్రొసీడ్‌పై క్లిక్ చేస్తే పేమెంట్ పేజీకి వెళుతుంది. ఇక్కడ పేమెంట్ పూర్తయ్యాక ఈ-టికెట్ యూఆర్ఎల్ వాట్సాప్‌ చాట్‌కే వస్తుంది. దానిపై క్లిక్ చేస్తే QRకోడ్‌ ఈ-టికెట్ డౌన్‌లోడ్ అవుతుంది. ఇక మెట్రో గేట్ వద్ద ఈ QR కోడ్ స్కాన్ చేసి ఎంటర్ అవొచ్చు.

Exit mobile version