Site icon HashtagU Telugu

WhatsApp QR Code : వాట్సాప్‌ ఛాట్ లిస్ట్‌లోనే QR కోడ్​!

Whatsapp Qr Code

Whatsapp Qr Code

WhatsApp QR Code : యూజర్ల కోసం కొత్త కొత్త ఫీచర్లను తీసుకొచ్చిన ‘వాట్సాప్’ ఇప్పుడు యూపీఐ పేమెంట్స్ విభాగంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది.  ఇందులో భాగంగా కొంతమంది యూజర్ల కోసం ఒక అట్రాక్టివ్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. అదేమిటంటే..వాట్సాప్ ఛాట్ లిస్టులోనే యూపీఐ క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. వాట్సాప్ బ్యానర్‌, కెమెరా సింబల్‌ మధ్యలో క్యూఆర్‌ కోడ్‌ స్కానర్‌‌ను ఇస్తున్నారు. దీన్ని ఉపయోగించి వాట్సాప్‌ యూపీఐకి లింక్‌ చేసిన బ్యాంక్​ ఖాతా ద్వారా నేరుగా పేమెంట్స్‌ చేయొచ్చు. ఈ ప్రాసెస్ చాలా ఈజీ. ఇంతకుముందు వరకు వాట్సాప్ యూజర్స్ యూపీఐ పేమెంట్స్ చేసే టైంలో క్యూఆర్ కోడ్ ఆప్షన్ కోసం త్రీ డాట్స్‌లోకి వెళ్లి, పేమెంట్స్‌ మెనూ ఓపెన్ చేయాల్సి వచ్చేది. దీనివల్ల ఎంతో సమయం వేస్ట్ అవుతోంది.ఫలితంగా చాలామంది వాట్సాప్‌లో యూపీఐని వాడేందుకు ఆసక్తి చూపించలేదు.  ఛాట్ లిస్టులోనే క్యూఆర్ కోడ్ ఉన్నందు వల్ల  ఇకపై చాలా ఫాస్టుగా వాట్సాప్ యూజర్స్ యూపీఐ పేమెంట్స్ చేసేందుకు వీలు కలుగుతుంది. ఈ ఫీచర్ వల్ల రానున్న రోజుల్లో తమ యూపీఐ ఫీచర్ వినియోగం పెరుగుతుందని వాట్సాప్ కంపెనీ అంచనా వేస్తోంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్‌ బీటా టెస్టర్లకు మాత్రమే ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చారు. మిగతావారికి దశలవారీగా దీన్ని అందుబాటులోకి తేనున్నారు.

We’re now on WhatsApp. Click to Join

అమెరికా కంపెనీ వాట్సాప్ మన​ దేశంలో యూపీఐ పేమెంట్స్​ సేవలను ప్రారంభించి చాలా రోజులే అయ్యింది. కానీ దీనికి ఆశించిన స్థాయిలో ఆదరణ లభించలేదు. యూజర్లు చాట్‌ చేసేందుకు, స్టేటస్‌లు చూసేందుకు, ఆడియో/ వీడియో కాల్స్​ చేసుకునేందుకు మాత్రమే వాట్సప్‌ను  వాడుతున్నారు. వాట్సాప్ పేమెంట్స్ ఫీచర్​ను వాడడంలేదు. దీనిని గుర్తించిన వాట్సాప్​, తమ యూజర్లను చేరుకునేందుకు సరికొత్త ప్లాన్​తో ముందుగు వచ్చింది. యూపీఐ పేమెంట్స్‌ ఫీచర్‌ను(WhatsApp QR Code) చాలా సులభతరం చేసింది.

Also Read :550 Jobs : రైల్వేలో 550 జాబ్స్.. టెన్త్ పాసై, ఆ సర్టిఫికెట్ ఉంటే చాలు

‘సెర్చ్​ బై డేట్’ ఫీచర్

​ వాట్సాప్​ ‘సెర్చ్ బై డేట్’​ అనే సరికొత్త ఫీచర్​ను రోల్​అవుట్​ చేస్తోంది. దీని ​ ద్వారా మీకు కావాల్సిన నిర్దిష్ట తేదీలోని మెసేజ్​లను, మీడియా ఫైల్స్​ను సులువుగా చూడొచ్చు. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ డివైజ్​లతోపాటు ఐఓఎస్​, మ్యాక్​, వాట్సాప్​ వెబ్​ల్లోనూ పనిచేస్తుంది. సెర్చ్ బై డేట్ ఫీచర్ ఉపయోగిస్తే, మీరు కోరుకున్న తేదీలలోని ఛాట్​లు అన్నీ కనిపిస్తాయి. ప్రత్యేకంగా మీకు కావాల్సిన చాట్​ను​ మాత్రమే సెర్చ్​ చేద్దామంటే కుదరదు.

Also Read :Kadiyam Kavya : కడియం కావ్యకి అసమ్మతి సెగ..