Site icon HashtagU Telugu

25 Hours A Day: ఫ్యూచర్‌లో ఒక రోజుకు 25 గంటలు.. ఎందుకో చెప్పిన సైంటిస్టులు

25 Hours A Day Future Predictions American Scientists

25 Hours A Day: ‘‘ఒక రోజులో ఎన్ని గంటలు ఉంటాయి ?’’ అని ఎవరైనా అడిగితే మనం ఇచ్చే సమాధానం.. 24 గంటలు. ఫ్యూచర్‌లో మనం ఇచ్చే సమాధానం మారిపోతుందని సైంటిస్టులు అంటున్నారు. ఒకరోజులో25 గంటలు ఉంటాయని మనం ఆన్సర్ ఇవ్వాల్సి రావొచ్చని జోస్యం చెబుతున్నారు. ఇంతకీ ఎలా ? 24 గంటలు కాస్తా 25 గంటలుగా ఎలా మారుతాయి ? రోజులో మరో గంట టైం అదనంగా  ఎలా యాడ్ అవుతుంది ?  అనే ప్రశ్నలు మీ మైండ్‌లో ఉదయించి ఉంటాయి. అయితే ఈ కథనం చదివేయండి.

Also Read :Minister Posts: మంత్రుల పనితీరుపై చంద్రబాబు ఫోకస్.. త్వరలోనే నాగబాబుకు ఛాన్స్

రోజులో 25 గంటలు ఇలా వస్తాయి.. 

‘‘ఫ్యూచర్‌లో టైం ఎంతమేర మారుతుంది ?’’ అనే అంశంపై జర్మనీలోని మ్యూనిచ్ టెక్నికల్‌ యూనివర్సిటీ, అమెరికాలోని విస్కాన్సిన్‌-మాడిసన్‌ యూనివర్సిటీ సైంటిస్టులు సంయుక్త  పరిశోధన చేస్తున్నారు. భూమి తన చుట్టూ తాను తిరిగే వేగాన్ని బట్టి మనం టైంను లెక్కిస్తాం. కానీ ఇప్పుడు ఓ కారణం వల్ల లెక్క మారుతోందని సైంటిస్టులు చెబుతున్నారు. భూమి తన అక్షాన్ని ఆధారంగా చేసుకొని, తన చుట్టూ తాను తిరిగే వేగం అనేది క్రమంగా తగ్గుతోందని తాజా పరిశోధనల్లో గుర్తించారు. ఒకవేళ ఇదే పరిస్థితి కొనసాగితే.. భూమి తన చుట్టూ తాను తిరిగే వేగం తగ్గుతూపోతే  భవిష్యత్తులో ఒక రోజులో 25 గంటల టైం వస్తుందని పరిశోధకులు అంటున్నారు. రోజులో 25 గంటల టైం రావడానికి మరో 20 కోట్ల సంవత్సరాలు పట్టొచ్చని  శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

Also Read :Kavitha Audio Message: కవిత ఆడియో సందేశం.. ఆ అంశంపై కీలక వ్యాఖ్యలు

సమస్యంతా చంద్రుడి వల్లే.. 

భూమికి సహజ ఉపగ్రహం చంద్రుడు. ప్రతి సంవత్సరం చంద్రుడు(25 Hours A Day).. భూమి నుంచి దాదాపు 3.8 సెంటీమీటర్లు  వెనక్కి జరుగుతుంటాడు. ఈ క్రమంలో భూమి, చంద్రుడి  మధ్య ఉండే గురుత్వాకర్షణ శక్తిలో మార్పులు జరుగుతుంటాయి.  దీనివల్ల భూమిపై ఉన్న సముద్రాలపై ప్రభావం పడుతుంది. ఆయా సముద్రాల్లోని జలప్రవాహాల గతిలో, క్రమంలో మార్పు వస్తుంది. సముద్రాలపై పడే ఈ  ప్రతికూల ప్రభావం వల్ల భూమి తన చుట్టూ తాను తిరిగే వేగం క్రమంగా తగ్గిపోతోంది.  రింగ్ లేజర్ జైరోస్కోప్ అనే అత్యాధునిక సాంకేతిక పరికరంతో ఈ సూక్ష్మ మార్పులను గుర్తించామని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

140 కోట్ల ఏళ్ల క్రితం ఎలా ఉండేదంటే..

శాస్త్రవేత్తల కథనం ప్రకారం.. దాదాపు 140 కోట్ల ఏళ్ల క్రితం చంద్రుడు భూమికి చాలా దగ్గరగా ఉన్నప్పుడు.. భూమి తన చుట్టూ తాను తిరిగే వేగం ఎక్కువగా ఉండేది. అప్పుడు ఒక రోజు గడవడానికి 18 గంటలే పట్టేదట. భూమికి చంద్రుడు  దూరమవుతున్న కొద్దీ.. భూమి తన చుట్టూ తాను తిరిగే వేగం తగ్గిపోయింది. దీనివల్ల రోజులో 24 గంటల టైం వచ్చేసింది.