Site icon HashtagU Telugu

Curtain On Phone: చాట్ చేస్తున్నప్పుడు పక్క వారికి కనిపించకుండా ఉండాలా.. అయితే ఇలా చెయ్యండి!

Whatsapp Trick

Whatsapp Trick

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి మనందరికీ తెలిసిందే. నిత్యం కొన్ని లక్షలాదిమంది వినియోగదారులు ఈ వాట్సాప్ ను వినియోగిస్తూనే ఉంటారు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించే యాప్ లలో వాట్సాప్ కూడా ఒకటి. ఈ వాట్సాప్ ను పర్సనల్ పనుల కోసం అలాగే ఆఫీసుల వ్యవహారాల కోసం వినియోగిస్తూ ఉన్నారు. అయితే చాలామంది నడుస్తున్నప్పుడు, బయటికి వెళ్లినప్పుడు, చుట్టూ మనుషులు ఉన్నప్పుడు ఇలా అనేక ప్రదేశాలలో కూడా వాట్సాప్. అయితే జనం ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో వాట్సాప్ చాటింగ్ చేయాలి అంటే చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు.

ఎందుకు గల కారణం వారి వాట్సాప్ చాటింగ్ పక్కవారికి ఎక్కడ కనిపిస్తుందో అని. అయితే చాలామంది వాట్సాప్ లో చాటింగ్ చేస్తున్నప్పుడు పక్కన వ్యక్తులు చదువుతూ ఉంటారు. ఇలా పక్కన వ్యక్తులు చదవకుండా ఉండాలి అంటే అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. నలుగురిలో ఉన్నప్పుడు మీ వాట్సాప్ చాట్ పక్కన వ్యక్తులు చదవకుండా ఉండాలి అంటే మీ స్క్రీన్ పై వర్చువల్ తెర అన్నది ఉండాలి. ఇందుకోసం మన మొబైల్లో ఒక యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

ప్లే స్టోర్ లోకి వెళ్లి అక్కడ మాస్క్ చాట్ హైడ్ చాట్ (Mask Chat-Hide chat) అని టైప్ చేసి ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు స్క్రీన్ పై ఫ్లోటింగ్ మాస్క్ ఐకాన్ కనిపిస్తుంది. ఇతరులకు కనిపించకుండా దాచాలి అనుకున్నప్పుడు దానిని ఆన్ చేయండి. వర్చువల్ తెర పెద్దగా ఉంచాలి, ఎంత పారదర్శకంగా ఉంచాలి అన్నది కూడా మీ చేతుల్లోనే ఉంటుంది. ఈ చిన్న యాప్ ద్వారా మీరు చేసే చాట్ పక్క వ్యక్తులకు కనిపించకుండా చేయవచ్చు.