Site icon HashtagU Telugu

LIC on WhatsApp : ఇక మీదట వాట్సాప్ లో ఎల్ఐసీ సేవలు.. హలో అంటే చాలట?

Now Lic Services On Whatsapp.. Saying Hello Is Enough..

Now Lic Services On Whatsapp.. Saying Hello Is Enough..

LIC Services on WhatsApp : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సంస్థ ఇప్పటికే ఎన్నో రకాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం అందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది నిత్యం వినియోగిస్తున్న మెసేజింగ్ యాప్స్ లో వాట్సాప్ ముందు వరుసలో ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అలా వాట్సాప్ (WhatsApp) వినియోగదారుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో వాట్సాప్ సంస్థ వారు కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగానే తాజాగా మరో సరికొత్త ఫీచర్ ని పరిచయం చేసింది. అదేమిటంటే వాట్సాప్ (WhatsApp) లో ఎల్ఐసి సేవలు.

We’re Now on WhatsApp. Click to Join.

తన పాలసీదారులకు కోసం ఎల్ఐసీ (LIC) వాట్సాప్ సేవలను ప్రవేశపెట్టింది. ఎల్‌ఐసీ వెబ్ పోర్టల్‌లో తమ పాలసీలను నమోదు చేసుకున్న పాలసీదారులు ఈ సేవలను ఆస్వాదించడానికి అర్హులు. దీని ద్వారా పాలసీదారులు ప్రీమియం సమాచారం, యులిప్ ప్లాన్ స్టేట్‌ మెంట్‌ల వంటి అనేక రకాల ప్రయోజనాలను పొందేందుకు వాట్సాప్ సేవలను ఉపయోగించుకోవచ్చు. మరి వాట్సాప్ లో ఎల్ఐసి సేవలను ఎలా వినియోగించుకోవాలి అన్న విషయానికి వస్తే… ముందుగా ఎల్ఐసీ (LIC) అధికారిక వెబ్‌సైట్(www.licindia.in)లో తమ పాలసీలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి.

ఆ తర్వాత వాట్సాప్ సేవలను ప్రారంభించడానికి ఎల్ఐసీ అధికారిక వాట్సాప్ నంబర్ అయిన 8976862090ను ఫోన్ లో సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆ నంబర్ ను వాట్సాప్ లో ఓపెన్ చేసి, చాట్ బాక్స్ లో హలో అని మెసేజ్ చేయాలి. మీకు అప్పుడు 11 ఆప్షన్లతో కూడిన రిప్లై వస్తుంది. మీకు అవసరమైన సేవను ఎంచుకోవడానికి, ఆ పదకొండు ఆప్షన్లలో ఏదో ఒకటి ఎంపిక చేసుకొని, దానికి పక్కన ఉన్న నంబర్ తో రిప్లై ఇవ్వండి. దానికి సంబంధించిన సమాచారం మొత్తం మీకు ఎల్ఐసీ అందిస్తుంది. వాట్సాప్ ద్వారా ఎల్ఐసి ఎటువంటి సేవలు అందించనుంది అంటే.. ప్రీమియం బకాయి, బోనస్ సమాచారం, పాలసీ స్థితి, లోన్ అర్హత కొటేషన్, లోన్ రీపేమెంట్ కొటేషన్,లోన్ వడ్డీ, చెల్లించాల్సిన ప్రీమియం చెల్లించిన సర్టిఫికెట్, యులిప్ -యూనిట్‌ల స్టేట్‌మెంట్, ఎల్ఐసీ సేవల లింక్‌లు, ఆప్ట్ ఇన్/ఆప్ట్ అవుట్ సర్వీస్ లు లాంటి సేవలు వాట్సాప్ లో ఇకమీదట లభించునున్నాయి.

Also Read:  Komaki LY EV Scooter : ఆ ఈవీ స్కూటర్ పై బంపర్ ఆఫర్.. ఏకంగా రూ.19 వేల తగ్గింపు?