Whats APP : ఐవోఎస్ ఫోన్ టు ఆండ్రాయిడ్‌ వాట్సప్ డేటా బదిలీ.. మరో కొత్త ఫీచర్

వాట్సప్‌లో అద్భుతమైన ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్ ఫోన్‌కు చాట్ హిస్టరీ బదిలీ చేసే సౌకర్యం మొన్నటివరకూ కేవలం బీటా యూజర్లకుండేది.

  • Written By:
  • Publish Date - July 22, 2022 / 02:00 PM IST

వాట్సప్‌లో అద్భుతమైన ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్ ఫోన్‌కు చాట్ హిస్టరీ బదిలీ చేసే సౌకర్యం మొన్నటివరకూ కేవలం బీటా యూజర్లకుండేది. ఇప్పుడు ఇది అందరికీ అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా మీ ఎక్కౌంట్ ఇన్‌ఫో, ప్రొఫైల్ ఫోటో, గ్రూప్ చాట్, చాట్ హిస్టరీ, మీడియా సెట్టింగ్స్ అన్నీ బదిలీ అయిపోతాయి. మీ డేటా ఏదీ మిస్సవకుండా బదిలీ అవుతుంది.

డేటా బదిలీ ఇలా..

* ఐవోఎస్ 15.5 లేదా తరువాతి వెర్షన్‌పై నడిచే ఐఫోన్, ఆండ్రాయిడ్ 5 ఫోన్ ఉండాలి. ఇవి కాకుండా మీ ఆండ్రాయిడ్ డివైస్‌లో వాట్సప్ వెర్షన్ 2.22.7.74  ఉండాలి.
* ఐవోఎస్ డివైస్‌లో అయితే వాట్సప్ వెర్షన్ 2.22.10.70 అవసరం.
* అటు ఐఫోన్ కూడా కొత్తది లేదా ఫ్యాక్టరీ రీసెట్ అయుండాలి.
* తొలుత ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఐవోఎస్ సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ చేసుండాలి. మీ కొత్త ఐవోఎస్ డివైస్‌లో ఒకటే ఫోన్ నెంబర్ యూజ్ చేసుండాలి. రెండు ఫోన్లు ఒకే వైఫై నెట్‌వర్క్‌తో కనెక్ట్ కావాలి.
ఇతర స్టెప్స్‌ను FAQ పేజిలో చూడవచ్చు.
* బదిలీ అయ్యే మీ డేటా రహస్యంగా ఉంటుంది. డేటా బదిలీ తరువాత పాత ఫోన్ నుంచి డేటా డిలీట్ చేయవచ్చు. కాల్ హిస్టరీ, కాంటాక్ట్ నేమ్స్ మాత్రం బదిలీ కావు.

వాట్సప్ స్టేటస్‌లో వాయిస్ నోట్స్‌..

వాట్సప్ స్టేటస్‌లో ప్రస్తుతం ఏదైనా టెక్స్‌ట్, ఫోటో, వీడియో మాత్రమే పెట్టే అవకాశం ఉంది. త్వరలో మరో ఫీచర్ రాబోతోంది. వాయిస్ నోట్స్‌ని కూడా వాట్సప్ స్టేటస్‌గా పెట్టొచ్చు. అంటే వాయిస్ మెసేజెస్‌ని యూజర్లు తమ స్టేటస్‌గా పెట్టుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ని వాట్సప్ టెస్ట్ చేస్తున్నట్టు WABetaInfo తెలిపింది. వాట్సప్ ఈ ఫీచర్‌కు వాయిస్ స్టేటస్ అని పేరు పెట్టింది.