Air bag: ఇకపై స్కూటర్ లో కూడా ఎయిర్ బ్యాగ్.. త్వరలోనే అందుబాటులోకి!?

దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది లక్షల మంది రోడ్డు ప్రమాదాల బారినపడి మరణిస్తున్నారు. వీరిలో ఎవరో కొంతమంది మాత్రమే

  • Written By:
  • Publish Date - October 24, 2022 / 04:30 PM IST

దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది లక్షల మంది రోడ్డు ప్రమాదాల బారినపడి మరణిస్తున్నారు. వీరిలో ఎవరో కొంతమంది మాత్రమే అదృష్టవశాత్తు బతికి బయటపడుతున్నారు. అయితే ఇప్పటికి ప్రభుత్వం ట్రాఫిక్ ఆంక్షల విషయంలో ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ వాహనదారులు మాత్రం వాటిని పట్టించుకోవడం లేదు. అలాగే ఈ ప్రమాదాల సంఖ్యను తగ్గించడం కోసం ప్రభుత్వం సీరియస్‌గా వ్యవహరిస్తూ ఎప్పటికప్పుడు అభివృద్ధిని కొనసాగిస్తోంది. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని స్కూటర్‌లో ఎయిర్‌ బ్యాగ్‌ల వంటి సెక్యూరిటి ఫీచర్ లను తీసుకురావడానికి ఒక ద్విచక్ర వాహన తయారీ సంస్థ గట్టిగానే కృషి చేస్తోంది.

అయితే ఇప్పటివరకు కేవలం ఫోర్ వీలర్ లలో మాత్రమే మనము ఎయిర్ బ్యాగ్ లు వస్తాయి. కానీ ఇకపై ఎయిర్ బ్యాగుతో స్కూటర్ ను ఏ కంపెనీ తీసుకొస్తుంది అన్న ప్రశ్నకు.. జపాన్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా ఇకపై స్కూటర్లలో ఎయిర్ బ్యాగులను తీసుకొని రావచ్చు అని వార్తలు వినిపిస్తున్నాయి.తాజాగా దీనికి సంబంధించి దరఖాస్తు కూడా చేసిందట. అయితే ఈ ఎయిర్ బ్యాగ్ లను స్కూటర్ మధ్యలో అమర్చవచ్చు. హ్యాండిల్ మధ్యలో ఉండటం వల్ల ఎయిర్‌ బ్యాగ్ ప్రమాదం జరిగినప్పుడు డ్రైవర్‌ ను సురక్షితంగా ఉంచడంలో బాగా సహాయపడుతుంది.

ఈ స్కూటర్ ఎయిర్ బ్యాగ్ కార్లలో ఉండే ఎయిర్‌బ్యాగ్‌ల లాగానే పని చేస్తుంది కానీ కార్లలోని సిస్టమ్‌కు కాస్త భిన్నంగా ఉంటుంది. ఇకపోతే ఎయిర్ బ్యాగ్ స్కూటర్ లు లాంచ్ ఎప్పుడు అన్న విషయాల విషయానికొస్తే. 2009 సంవత్సరంలో హోండా థాయ్‌లాండ్ అండ్ జపాన్‌లలో ఈ స్కూటర్‌ను పరిచయం చేసింది. PCX అనే ఈ స్కూటర్‌లో ఎయిర్‌బ్యాగ్ ఆప్షన్ ఇచ్చారు. ఇప్పుడు కంపెనీ మరోసారి ఎయిర్‌ బ్యాగ్‌లతో కూడిన కొత్త స్కూటర్‌ను అందించవచ్చట.