Site icon HashtagU Telugu

Nothing Phone: కేవలం రూ.749కే నథింగ్ స్మార్ట్ ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే?

Nothing Phone

Nothing Phone

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ నథింగ్ ఫోన్ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్  కలిగిన స్మార్ట్ ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది. వినియోగదారులను ఆకర్షించుకోవడం కోసం తక్కువ ధరకే మంచి మంచి ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్ లను విడుదల చేస్తూనే నథింగ్ సంస్థ. ఇది ఇలా ఉంటే త్వరలోనే నథింగ్ ఫోన్ 2 మార్కెట్లోకి లాంచింగ్ సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా నథింగ్ ఫోన్ 1 ఫ్లిప్కార్ట్ లో భారీ తగ్గింపుతో లభిస్తోంది.

ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో బాగా సేల్ అవుతున్న నథింగ్ ఫోన్ వన్‌ ఇపుడు రూ. 39,250 తగ్గింపు తర్వాత కేవలం రూ.749కే అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 8,000 తగ్గింపు తర్వాత రూ. 31,999గా లిస్ట్‌ అయింది. దీనితో పాటు హెచ్‌డీఎఫ్‌సీ ఈఎంఐ లావాదేవీలపై రూ. 1,250 తగ్గింపు లభిస్తోంది. దీనికి అదనంగా, పాత స్మార్ట్‌ ఫోన్‌కు బదులుగా రూ. 30,000 వరకు తగ్గింపును కూడా అందిస్తోంది. ఈ ఆఫర్లన్నీ వర్తించిన తరువాత నథింగ్ ఫోన్ 1ను రూ. 749కే కొనుగోలు చేయవచ్చు.

ఇకపోతే ఈ నథింగ్ ఫోన్ 1 స్పెసిఫికేషన్‌ ల విషయానికి వస్తే.. 6.55-అంగుళాల OLED డిస్‌ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణ, 120Hz రిఫ్రెష్ రేట్‌, ఆండ్రాయిడ్ ఆధారిత నథింగ్ OS, Qualcomm Snapdragon 778జి+ చిప్‌సెట్ 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ తో రానుంది. కెమెరా విషయానికి వస్తే.. 50 ఎంపీ డ్యుయల్‌ రియర్‌ కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా తో లభించనుంది. అలాగే 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 4,500 mAh బ్యాటరీ సామర్థ్యంను కలిగి ఉండనుంది.