Site icon HashtagU Telugu

Nothing Phone 2: నథింగ్ ఫోన్ 2 ప్రీ-బుకింగ్ నేటి నుంచే.. ఈ స్మార్ట్ ఫోన్ ధర ఎంతంటే..?

Nothing Phone 2

Resizeimagesize (1280 X 720) (3) 11zon

Nothing Phone 2: నథింగ్ ఫోన్ 2 (Nothing Phone 2) స్మార్ట్‌ఫోన్ ప్రీ-బుకింగ్ భారతదేశంలో ప్రారంభమైంది. ఈ ఫోన్‌ను ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్ నుండి లాంచ్ చేయడానికి ముందు బుక్ చేసుకోవచ్చు. నథింగ్ ఫోన్ 2 ప్రీ-బుకింగ్‌తో కంపెనీ వినియోగదారులకు అనేక ఆఫర్‌లు, తగ్గింపులను అందిస్తోంది.

ఫోన్ 2 ప్రీ-ఆర్డర్ ఆఫర్స్

రూ.1,299 విలువైన నథింగ్ ఫోన్ 2 కేస్‌ను రూ.499 ధరకు, రూ.999 విలువైన ఫోన్ 2 స్క్రీన్ ప్రొటెక్టర్‌ను రూ.399 ధరకు, రూ.2,499 విలువైన నథింగ్ పవర్ 45వాట్ ఛార్జర్‌ను రూ.1,499 ధరకు కొనొచ్చు. ప్రముఖ బ్యాంకుల నుంచి ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. నథింగ్ ఫోన్ 2 ప్రీఆర్డర్స్ స్టాక్ ఉన్నంతవరకేనని షరతు విధించింది. ఇది కాకుండా కొన్ని బ్యాంకులు తక్షణ తగ్గింపును కూడా అందిస్తున్నాయి. లాంచ్ ఆఫర్‌తో కొనుగోలుదారులు నథింగ్ ఇయర్ (స్టిక్) TWSని రూ.4,250కి కొనుగోలు చేయవచ్చు.

నథింగ్ ఫోన్ 2 ప్రీ-బుక్

కొనుగోలుదారులు నథింగ్ ఫోన్ 2ని ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.2,000తో బుక్ చేసుకోవచ్చు. జూలై 11న స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసిన తర్వాత, కొనుగోలుదారులు బ్యాలెన్స్ మొత్తాన్ని చెల్లించి ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ప్రీ-బుకింగ్ ఆఫర్‌లను పొందేందుకు కొనుగోలుదారులు జూన్ 29 మధ్యాహ్నం 12 గంటల నుంచి నథింగ్ ఫోన్ 2 మొబైల్‌ను మీరు ప్రీ-ఆర్డర్ చేయొచ్చు.దీనితో పాటు ప్రీ-ఆర్డర్ చేసిన కొనుగోలుదారులు ఓపెన్ సేల్‌కు ముందు ఫోన్‌ను పొందుతారు. జూలై 11 రాత్రి 8.30 గంటలకు నథింగ్ ఫోన్ 2 అధికారికంగా లాంఛ్ కానుంది.

Also Read: India: భారత్ లో ఇంటర్నెట్ షట్‌డౌన్‌ వల్ల కోట్లలో నష్టం

నథింగ్ ఫోన్ 2 స్పెసిఫికేషన్స్

స్పెసిఫికేషన్ గురించి మాట్లాడితే.. Nothing Phone 2 Qualcomm స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్‌తో అందించబడుతుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత నథింగ్ OS 2.0పై రన్ అవుతుంది. నివేదికలను విశ్వసిస్తే.. ఫోన్ 6.7-అంగుళాల OLED డిస్ప్లే, 4700mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. బాక్స్ లోపల ఫోన్‌తో పాటు పారదర్శక టైప్-సి కేబుల్‌ను అందించవచ్చు. గత సంవత్సరం మాదిరిగానే రాబోయే నథింగ్ ఫోన్ 2లో Glyph ఇంటర్‌ఫేస్ ఇవ్వబడుతుంది.

నథింగ్ ఫోన్ 2 ధర ఎంత ఉంటుంది?

నథింగ్ ఫోన్ 2 స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో జూలై 11న విడుదల కానుంది. మీడియా నివేదికల ప్రకారం.. ఈ ఫోన్‌ను భారతదేశంలో రూ. 40 వేల నుండి రూ. 45 వేల కంటే తక్కువ ధరకు విడుదల చేయవచ్చు.