Site icon HashtagU Telugu

Nothing Phone: నథింగ్ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ లీక్? స్పెసిఫికేషన్స్ ఇవేనా..?

Nothing Phone 1 Imresizer

Nothing Phone 1 Imresizer

నథింగ్….ఈ టెక్ బ్రాండ్ ప్రపంచానికి కొన్నాళ్ల క్రితమే పరిచయం అయ్యింది. నథింగ్ పేరుతో కొత్త బ్రాండ్ ను వన్ ప్లస్ నుంచి బయటకువచ్చిన కో-పౌండర్ కార్ల్ పెయ్ నథింగ్ బ్రాండ్ ను ఆవిష్కరించారు. నథింగ్ ఇయర్ 1 టీడబ్ల్యూఎస్ ని కూడా పరిచయం చేశారు. నథింగ్ ఇయర్ 1 టీడబ్ల్యూఎస్ డిజైన్ ఎంతగానో ఆకట్టుకుంది. ఇక నథింగ్ బ్రాండ్ నుంచి స్మార్ట్ ఫోన్ కూడా త్వరలోనే రాబోతోంది. వన్ ప్లస్ కో-ఫౌండర్ స్థాపించిన బ్రాండ్ కావడంతో నథింగ్ స్మార్ట్ ఫోన్ పై భారీగానే అంచనాలు ఉన్నాయి. ఈ మధ్యే నథింగ్ లాంఛర్ కూడా అందుబాటులోకి వచ్చింది. నథింగ్ ఫోన్ 1 కంపెనీ కసరత్తు ప్రారంభించింది. వేసవిలోఈ స్మార్ట్ ఫోన్ విడుదల చేయబోతున్నట్లు కంపెనీ ట్వీట్ చేసింది.

ఇక నథింగ్ నుంచి రాబోతున్న మొదటి స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన ఫీచర్స్ గురించి అఫీషియల్ గా ఎలాంటి వివరాలు బయటకు రాలేవు. ఫ్లిప్ కార్ట్ టీజర్ పేజీ అందుబాటులోఉన్నా అందులోనూ ఎలాంటి డీటెయిల్స్ లేవు. కానీ నథింగ్ ఫోన్ 1 మొబైల్ ఫీచర్స్ గురించి లీక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నథింగ్ ఫోన్ 1 మిడ్ రేంజ్ సెగ్మెంట్ లోరాబోతోందన్నది ఆ లీక్స్ ను బట్టి తెలుస్తోంది.