Site icon HashtagU Telugu

Nothing Phone 1: నథింగ్ ఫోన్ నెక్స్ట్ ఓపెన్ సేల్ ఎప్పుడు? ఈ ఫోన్ ఖరీదు ఎంత? 

Nothing Phone 1

Nothing Phone 1

ఇండియాలో నథింగ్ ఫోన్ (1) సొంతం చేసుకునే అవకాశం రెండుసార్లు ప్రజల ముందుకు వచ్చింది. రెండు సందర్భాల్లోనూ సేల్ స్టార్ట్ అయిన కొన్ని గంటల్లోనే ఫోన్ స్టాక్ అయిపోయింది. ఇప్పుడు మూడోసారి ఫోన్ సేల్స్ స్టార్ట్ చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది. భారత దేశంలో నథింగ్ ఫోన్ (1) ధరను రూ. 32,999గా నిర్ణయించారు.

మొదటి సేల్‌లో కొనుగోలుదారులకు ఫ్లాట్ రూ. 1,000 తగ్గింపుతో ఫోన్ ఇచ్చారు. ఇప్పుడు ఆ ఆఫర్ ముగిసింది. ఆగస్టు 5వ తేదీన నెక్స్ట్ సేల్ ఉంటుందని కంపెనీ ప్రకటించింది. ఫోన్ కావాల్సిన వారు ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. అందుకని, ఆగస్టు 5న ఆ యాప్ / సైట్ చెక్ చేస్తూ ఉంటే మంచిది.

8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌తో కూడిన నథింగ్ ఫోన్ (1)  బేస్ వేరియంట్ ధర 32,౯౯౯ రూపాయలు. ఇది కాకుండా మరో రెండు వేరియంట్‌లు ఉన్నాయి. 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌తో ఒకటి… 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌తో మరొకటి ఉన్నాయి. వాటి ధర వరుసగా రూ.35,999 , రూ.38,999 ఉండవచ్చని అంచనా.

ఈ ఫోన్ ప్రత్యేకతలు ఏంటి?

ఈ స్మార్ట్‌ఫోన్‌లో ప్రత్యేకతలు ఏంటి? ఎందుకు ఇంత మంది ఎదురు చూస్తున్నారు? అనే అంశాల్లోకి వెళితే… ఫోన్ హార్డ్‌వేర్ లేదంటే పనితీరు, రేటు కారణం కాదు. మొదటి కారణం… ఫోన్ యొక్క ‘గ్లిఫ్’ ఇంటర్‌ఫేస్.

రెండోది… ఫోన్ వెనుక ట్రాన్స్‌ప‌రెంట్‌గా ఉండే బ్లాక్ ప్యాన‌ల్‌ కింద ఉన్న ఎల్ఈడీ లైట్ సెట్. కెమెరా విషయానికి వస్తే… 16  మెగా పిక్సల్స్ ఫ్రంట్ కెమెరా, 50 మెగా పిక్సల్స్ బ్యాక్ కెమెరా ఫీచర్ ఆకట్టుకునేలా ఉంది.

6.55 అంగుళాల పూర్తి హెచ్‌డీ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను ఉంది. కంపెనీ రూపొందించిన  ఆండ్రాయిడ్ ఓఎస్, అలాగే ౩౩ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడిన 4,500mAh బ్యాటరీ కూడా అందించబడుతుంది.

Exit mobile version