ఈమధ్య స్మార్ట్ ఫోన్ లలో రకరకాల ఫీచర్స్ తో ఉన్న కొత్త కొత్త మోడల్స్ మార్కెట్ లోకి వస్తున్నాయి. ఇక తాజాగా నథింగ్ ఫోన్ వన్ అనే కొత్త ఫీచర్ ఫోన్ కూడా త్వరలో మార్కెట్లోకి రానుంది. జూలై 12న ఈ ఫోన్ లాంచ్ కానుంది. అంతేకాకుండా ఈ ఫోన్ ధర గురించి సమాచారం కూడా లీక్ అయింది.
ఇక ఇది అందరికీ ఆకర్షణీయమైన ధరలో వచ్చేలా కనిపిస్తుంది. ఇక దీన్ని ధర వివరాలు rootmygalaxy.net లో సమాచారం ఉంది. 8gb ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్ ద్వారా సుమారు 31,000 అని తెలుస్తుంది. ఇక 8gb ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ధర 33,000 అని, 12gb ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ 35, 900 ఉంటుందని తెలుస్తుంది.
ఇక భారత్ లో దీని ప్రారంభం ధర 32 వేలలో ఉంటుందని సమాచారం. ఇది ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ కానుంది. ఇక దానికంటే ముందు ఇన్వైట్ పాస్ కోసం నథింగ్ వెబ్సైట్ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. వైట్, బ్లాక్ కలర్ ఆప్షన్ తో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా ఆఫ్లైన్లో రిలయన్స్ డిజిటల్ తో కూడా ఈ ఫోన్ అందుబాటులో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఈ ఫోన్ కు మంచి స్పెసిఫికేషన్స్ లో కూడా ఉన్నాయి. 45 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ ఉంటుందని తెలిసింది. అంతేకాకుండా అన్ని కనెక్టువిటీ ఫీచర్లు కూడా ఉన్నాయి.
