Site icon HashtagU Telugu

Nothing Phone 2: భారత మార్కెట్ లోకి నథింగ్ ఫోన్ 2.. ధర, ఫీచర్స్ ఇవే?

Nothing Phone 2

Nothing Phone 2

యూకేకి చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ నథింగ్ ఫోన్ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్ కలిగిన స్మార్ట్ ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది. వినియోగదారులను ఆకర్షించుకోవడం కోసం తక్కువ ధరకే మంచి మంచి ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్ లను అందుబాటులోకి తీసుకువస్తోంది నథింగ్ సంస్థ. ఇది ఇలా ఉంటే తాజాగా నథింగ్‌ ఫోన్‌ 2 కూడా భారత మార్కెట్లోకి వచ్చేసింది. మరి ఈ నథింగ్ ఫోన్ 2 ధర ఫీచర్ల విషయానికొస్తే..

నథింగ్ ఫోన్‌ 2 జులై 21 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి రానుంది. అయితే ఇప్పటికే ముందస్తు బుకింగ్‌లు ప్రారంభం అయ్యాయి. నథింగ్ ఫోన్‌ 2లో 6.7 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. 1,080×2,412 పిక్సెల్‌ రిజల్యూషన్‌ ఈ స్మార్ట్ ఫోన్‌ సొంతం. ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేస్తుంది. క్వాల్కమ్‌ 4ఎన్‌ఎమ్‌ స్నాప్‌డ్రాగన్‌తో పని చేసే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 50 మెగా పిక్సెల్ రెయిర్‌ కెమెరాను ఇచ్చారు. అలాగే సెల్ఫీల కోసం 32 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను అందించారు. ఇకపోతే ధర విషయానికొస్తే..

ఈ స్మార్ట్ ఫోన్‌ బేస్‌ వేరియంట్ 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 44,999 కాగా, 12 జీబీ ర్యామ్‌, 256 స్టోరేజ్‌ ధర రూ. 49,999గా ఉండనుంది. అలాగే 12 జీబీ ర్యామ్‌, 512 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 54,999గా ఉండనుంది. త్వరలోనే మార్కెట్లోకి విడుదల కానున్న ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించి మరిన్ని ఫీచర్స్ తెలియాల్సి ఉంది.