Site icon HashtagU Telugu

CMF Phone 1: స్మార్ట్ ఫోన్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. మార్కెట్లోకి మరో బడ్జెట్ స్మార్ట్ ఫోన్?

Mixcollage 08 Jul 2024 07 01 Pm 630

Mixcollage 08 Jul 2024 07 01 Pm 630

లండన్ కు ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ నథింగ్‌ ఫోన్‌ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది. అంతే కాకుండా ఇప్పటికే మార్కెట్ లోకి విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ లపై భారీగా తగ్గింపు ధరలను ప్రకటిస్తోంది. ఇది ఇలా ఉంటే ఇప్పుడు మరొక సరికొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి విడుదల చేసింది నథింగ్ సంస్థ. మరి ఆ వివరాల్లోకి వెళితే..

నథింగ్ సబ్‌ బ్రాండ్‌ అయిన సీఎమ్‌ఎఫ్‌ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ ను లాంచ్‌ చేస్తోంది. సీఎమ్‌ఎఫ్‌ ఫోన్‌1 నేడు అనగా జులై 8 వ తేదీ మధ్యాహ్నం ఈ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసారు. మరి తాజాగా విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్లో ఇలాంటి ఫీచర్లు ఉన్నాయి అన్న వివరాల్లోకి వెళితే.. ఇందులో 6.67 ఇంచెస్‌తో కూడిన సూపర్‌ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. 120 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో పాటు హెచ్‌డీ10+ సపోర్ట్‌తో ఈ ఫోన్‌ రానుంది. ఇక ఈ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 చిప్‌పెస్‌ ప్రాసెసర్‌ తో పనిచేయనుంది.

అలాగే ఈ ఫోన్‌ లో ఐపీ52 రేటింగ్‌ తో డస్ట్‌, లైట్‌ స్ల్పాషెస్‌ ను తట్టుకునేలా డిజైన్‌ చేశారు. ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ ను కూడా అందించనున్నారు. 128 బీజీ స్టోరేజ్‌ కెపాసిటీ తో రానున్న ఈ ఫోన్‌ లో ఇంటర్నల్ మెమోరీని 2 టీబీ వరకు పెంచుకోవచ్చు. ఇక ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌ తో పనిచేస్తుంది. రెండేళ్లపాటు ఆపరేటింగ్ సిస్టమ్‌ అప్‌డేట్స్‌తో ఈ ఫోన్‌ రానుంది. ఇక మూడేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను ఇవ్వనున్నారు కెమెరా విషయానికొస్తే ఇందులో 50 ఎంపీతో కూడిన రెయిర్‌ కెమెరాను కూడా అందించనున్నారు.
ఇకపోతే ఈ ఫోన్ బ్యాటరీ విషయానికొస్తే.. ఇందులో 33 వాట్స్‌ ఛార్జింగ్‌ కు సపోర్ట్‌ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని ఇచ్చారు.కాగా ధర పరంగా చూస్తే 6 జీబీ ర్యామ్‌ 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 15,999 కాగా 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 17,999గా ఉండవచ్చని అంచనా.