Site icon HashtagU Telugu

Nothing Ear Stick: నథింగ్ నుంచి వైర్‌లెస్ ఇయర్ బడ్స్.. ఎలా ఉన్నాయంటే?

Nothing Ear Stick

Nothing Ear Stick

ఎలక్ట్రానిక్ మార్కెట్ లో లండన్ కు చెందిన నథింగ్ బ్రాండ్ కు ఉన్న ప్రత్యేకత గురించి మనందరికీ తెలిసిందే. ఈ నథింగ్ బ్రాండ్ నుంచి వచ్చిన నథింగ్ ఫోన్ ఒకసారిగా ప్రపంచం దృష్టిని వచ్చిన ఆకర్షించిన విషయం మనందరికీ తెలిసిందే. నథింగ్ ఫోన్ ఐఫోన్ ను పోలి ఉండటం మాత్రమే కాకుండా అద్భుతమైన డిజైన్ అలాగే అతి తక్కువ ధరలు, అద్భుతమైన ఫీచర్ లతో మార్కెట్ లో దూసుకుపోతోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ నథింగ్ బ్రాండ్ వైర్ లెస్ ఇయర్ బడ్స్ ను లాంచ్ చేసింది.

తాజాగా భారత్ మార్కెట్ లోకి విడుదల చేసిన ఈ నథింగ్ ఇయర్ బడ్స్ కి సంబంధించిన తొలి సేల్ నవంబర్ 17 నుంచి ప్రారంభం కానున్నాయి. మరి తాజాగా విడుదల చేసిన ఈ ఇయర్ బడ్స్ ధర, ఫీచర్లు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..నథింగ్‌ ఇయర్‌ బడ్స్ లో 12.6 ఎంఎం డ్రైవర్స్‌ అందించారు. అలాగే వీటి ద్వారా యూజర్ లు స్పష్టమైన క్లారిటీ తో సౌండ్‌ ను ఆస్వాదించవచ్చు. అంతేకాకుండా ఈ ఇయర్ బడ్స్ కేవలం 4.4 గ్రాముల బరువు మాత్రమే ఉన్నాయి.

అలాగే ఈ ఇయర్‌ బడ్స్‌ లో బేస్‌ లాక్‌, క్లియర్‌ వాయిస్‌ లాంటి సరికొత్త టెక్నాలజీ ని కూడా అందించారు. ఇయర్‌ బడ్స్‌ పైనే మ్యూజిక్‌ ను ప్లే, పాజ్‌, స్కిప్‌ చేసుకునే బటన్స్‌ను ఇచ్చారు. బ్యాటరీ విషయానికొస్తే వీటి ద్వారా నాన్‌స్టాప్‌గా ఏడు గంటలు, 3 గంటలు మ్యూజిక్‌ టాక్‌ టైమ్‌ వస్తుంది. ఇకపోతే ఈ నథింగ్‌ ఇయర్ బడ్స్ ధర విషయానికొస్తే భారత్‌ లో రూ. 8,499 గా ఉన్నాయి. అయితే భారత్‌ తో పాటు 40 దేశాలలో కూడా రేపు నెల అనగానే నవంబర్‌ 17 నుంచే ఈ ఇయర్‌ బడ్స్‌ మొదటి సేల్స్ ప్రారంభం అయ్యి పూర్తి స్థాయి లో అందుబాటులోకి రానున్నాయి.